రోడ్డు మరమ్మతులు చేయించండి
ABN, First Publish Date - 2020-12-11T05:39:09+05:30
రోడ్డు మరమ్మతులు చేయించండి
అదనపు కలెక్టర్ జాన్ శాంసన్
కీసర రూరల్: వరదలకు దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయించాలని నాగారం మున్సిపల్ అధికారులను అదనపు కలెక్టర్ జాన్ శాంసన్ ఆదేశించారు. గురువారం ఆయన నాగారం మునిసిపాలిటీలో పర్యటించారు. వర్మి కంపోస్ట్ యూనిట్‌ను, వరదలకు దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించారు. రాంపల్లి చౌరస్తా వద్దనున్న పెట్రోల్‌పంపు వద్దనున్న నాలాను ఆయన పరిశీలించారు. దుర్వాసన వెదజల్లుతూ, మురుగు పారుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ చంద్రారెడ్డి, కమిషనర్ వాణి, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బిజ్జ శ్రీవా్‌సగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-11T05:39:09+05:30 IST