ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరుగుతున్న కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-08-22T10:05:48+05:30

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 945 కరోనా కేసులు నమో దయ్యాయి. రంగారెడ్డిజిల్లాలో 485 కేసులు నమోదు కాగా, ఒకరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కరోజే  945 కేసులు నమోదు, ఇద్దరి మృతి 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిఅర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం 945 కరోనా కేసులు నమో దయ్యాయి. రంగారెడ్డిజిల్లాలో 485 కేసులు నమోదు కాగా, ఒకరు మృతిచెందారు. అలాగే మేడ్చల్‌జిల్లాలో 431 కేసులు నమోదుకాగా, ఒకరు మృతిచెందారు. వికారాబాద్‌జిల్లాలో 29 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మూడు జిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య 40,423కు చేరింది.


రంగారెడ్డి జిల్లాలో..

ఇబ్రహీంపట్నం / యాచారం / కందుకూరు / ఆమనగల్లు / శంషాబాద్‌ / షాద్‌నగర్‌ / చేవెళ్ల :ఇబ్రహీంపట్నం డివిజన్‌లో శుక్రవారం 332 మందికి కరోనా యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించగా 53 మందికి పాజిటివ్‌ వచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 17, ఇబ్రహీంపట్నంలో 10, యాచారంలో 6, దండుమైలారంలో 3, ఎలి మినేడులో 7, మంచాలలో 3, మాడ్గులలో 7 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. కందుకూరు ప్రభుత్వాస్పత్రిలో 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్‌ వచ్చింది. 


ఆమనగల్లు, మైసిగండి, ఇర్విన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 28 మందికి కరోనా పరీక్షలు నిర్వహిం చారు. అందులో 10 మందికి పాజిటివ్‌ వచ్చింది.


శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని ప్రభుత్వ ఆసు పత్రిలో కరోనా పరీక్షలు ప్రారంభించారు. శుక్రవారం 29మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే ఐదుగురికి పాజి టివ్‌ వచ్చింది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 24మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. అందులో 9మంది కొత్తూర్‌ మండలానికి చెందిన వారు ఉండగా, ఏడుగురు కేశంపేట మండ లానికి, ఆరుగురు ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన వారున్నారని తెలిపారు. మిగతా ఇద్దరు ఇతర మండలాలకు చెందిన వారున్నట్లు వివరించారు. 


చేవెళ్ల డివిజన్‌ పరిధిలో 263 మందికి  కరోనా పరీక్షలు చేయగా 45మందికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 97మందికి పరీక్షలు చేయగా 6, ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో 17 మందికి పరీక్షలు చేయగా 4, శంకర్‌పల్లి మండలంలో 76మందికి  పరీక్షలు చేయగా 4, మొయినాబాద్‌మండలంలో 51మందికి పరీ క్షలు చేయగా 10, షాబాద్‌ మండలంలో 22 మందికి  పరీక్షలు చేయగా 6 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.


వికారాబాద్‌ జిల్లాలో..

వికారాబాద్‌, ఆంధ్రజ్యోతి / కొడంగల్‌ / దౌల్తాబాద్‌ / కులకచర్ల /ధారూరు : వికారాబాద్‌ జిల్లాలో మరో జిల్లాస్థాయి అధికారి కరోనా బారిన పడ్డారు. ఆ అధికారితోపాటు ఆయన సతీమణి, కూతురుకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఈ అధికారి ఇటీవల కలెక్టరేట్‌లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు.


కొడంగల్‌, అంగడిరాయచూర్‌, దౌల్తాబాద్‌ ప్రభుత్వాసుపత్రుల్లో పలువురికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. అందులో కొడంగల్‌కు చెందిన ఇద్దరికి, దౌల్తాబాద్‌ మండలంలో ఇద్దరికి, అంగడిరైచూర్‌లో ఒకే కుటుంబానికి ఐదుగురికి కరోనా వైరస్‌ సోకినట్లు తెలిపారు. 


కొడంగల్‌లో మొదటి కరోనా మృతి

కొడంగల్‌లో మొదటి కరోనా మృతి నమోదైంది. పట్టణానికి చెందిన సరిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా తేలడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. 


దౌల్తాబాద్‌ మండలంలో ఇద్దరికి కరోనా సోకినట్లు వైద్యుడు రతన్‌లాల్‌ తెలిపారు. దౌల్తాబాద్‌లోని ఓబ్యాంకులో విధులు నిర్వహిస్తున్న యువకుడికి, పీహెచ్‌సీలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంకు పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. 


కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 14మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో అంతారం గ్రామవాసికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 


భార్యను ఆసుపత్రికి తీసుకొస్తే భర్తకు పాజిటివ్‌

భార్య అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తీసుకొస్తే భర్తకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కులకచర్ల మం డలం అంతారానికి చెందిన మహిళకు సుస్తి చేయడంతో ఆమె భర్త శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. అక్కడ ఇద్దరికీ కరోనా పరీక్షలు చేయగా భార్యకు నెగిటివ్‌, భర్తకు పాజిటివ్‌ వచ్చింది. 


ధారూరు తహసీల్దార్‌ కార్యాలయంలో పని చేసే సిబ్బందిలో ఒకరికి శుక్రవారం కరోనా పాజిటివ్‌ వచ్చిం దని వైద్యాధికారి రాజు తెలిపారు. కాగా ఆరోగ్య కేంద్రంలో 10 మందికి కరోనా పరీక్షలు చేయగా అందరికి నెగిటివ్‌ వచ్చిందని ఆయన చెప్పారు. 


మేడ్చల్‌ జిల్లాలో..

ఘట్‌కేసర్‌ : ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చెందిన వృద్ధుడు (70) కరోనాతో మృతి చెం దాడు. అనారోగ్యానికి గురైన వృద్ధుడిని కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. 

Updated Date - 2020-08-22T10:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising