ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌ఐవీ రోగులు మనోధైర్యంతో ఉండాలి

ABN, First Publish Date - 2020-12-02T05:28:48+05:30

హెచ్‌ఐవీ రోగులు మనోధైర్యంతో ఉండాలి

ఘట్‌కేసర్‌ ప్రభుత్వాసుపత్రిలో మాట్లాడుతున్న లక్ష్మీ పద్మావతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ ప్రభుత్వాసుపత్రి సీనియర్‌ వైద్యుడు ప్రసాద్‌


ఘట్‌కేసర్‌: హెచ్‌ఐవీబారిన పడిన వారు మనోధైర్యంతో ఉండాలని ఘట్‌కేసర్‌ ప్రభుత్వాసుపత్రి సీనియర్‌ వైద్యులు ప్రసాద్‌ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఐసీటీసీ కౌన్సిలర్‌ లక్ష్మీ పద్మావతి అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవీ రోగులు ఐసీటీసీ సహకారంతో ముందుకు సాగాలన్నారు. ఆసుపత్రికి వచ్చే హెచ్‌ఐవీ రోగులకు ఏఆర్‌టీ మందుల గురించి వివరించడంతో పాటు నేడు హెచ్‌ఐవీ అనేది సాధారణ వ్యాధి అనే విషయాన్ని గ్రహించాలన్నారు. క్రమం తప్పకుండా ఏఆర్‌టీ మందులను వాడుతూ సరైన ఆహారం తీసుకోవడం వలన సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని తెలిపారు. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరముందన్నారు. ఐసీటీసీ కేంద్రంలో రోగులకు అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తామని కౌన్సిలర్‌ లక్ష్మీ పద్మావతి అన్నారు. హెచ్‌ఐవీ రోగులకు మద్దతు తెలుపుతూ బాధ్యతను పంచుకున్నప్పుడే హెచ్‌ఐవీ వ్యాధి నియంత్రణకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ సోమన్న, చైల్డ్‌పౌన్డ్‌ సంస్థ ప్రతినిధి యశోద, నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T05:28:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising