ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరిత రక్షణేది?

ABN, First Publish Date - 2020-05-18T10:55:06+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేప ట్టిన హరితహారం కార్యక్రమం నవ్వులపాలవు తోంది. మొక్కలు నాటి వాటి సంరక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డుపై విరిగిపడుతున్న మొక్కలు 

సంరక్షణను మరిచిన అధికారులు 


శామీర్‌పేట రూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేప ట్టిన హరితహారం కార్యక్రమం నవ్వులపాలవు తోంది. మొక్కలు నాటి వాటి సంరక్షించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అంతర్గతరోడ్లపై ఉన్న మొక్కలు పాడైపోతు న్నాయి. మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ గ్రామ పంచాయతీకి అనుబంధ మైన జగ్గంగూడకాలనీ రోడ్డు నుంచి బొమ్మ రాశిపేట వరకు ఉన్న మొక్కలు విరిగి కిందపడి నిర్వహణకు నోచుకోవడం లేదు. ఇటీవల వీస్తున్న ఈదురుగాలులకు మొక్కలు పదుల సంఖ్యలో నేలకొరిగాయి. అధికారులు పట్టించుకోకపోవ డంతో వీటిని సరిచేసేవారే కరువయ్యారు. దీంతో ప్రభుత్వం హారితహారం పథకానికి ఖర్చుపెడుతున్న ధనం వృథా అవుతోం దని స్థానికులు మండిపడుతున్నారు. కొన్ని మొక్కలు నేలపై పడిపోగా, మరికొన్ని చెట్లు విరిగిపోతున్నాయి.


హరితహారం చెట్ల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి పాదులు చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొంది. చెట్లకు కట్టిన కర్రలు ఊడిపోయి మొక్కలు నేలపై ఒరిగిపోతున్నాయి. ఉన్నతాధికారులు సభలు, సమావేశాల్లో మొక్కలకు పాదులు చేయాలని, నీరు పోసి సంర క్షించాలని పదేపదే చెబుతున్నా అధికారులు మాత్రం వారి ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారు. అంతర్గత రోడ్ల వెంట ఉన్న తాధికారులు రారనే ఉద్దేశంతో ఆ దారిలో నాటిన మొక్క లను పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు వెంటనే స్పందించి నేలపై ఒరిగిన చెట్లను సరిచేయాలని, విరిగిపోయిన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని కోరుతున్నారు.  

Updated Date - 2020-05-18T10:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising