ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా తాటికుంట మైసమ్మ ఉత్సవాలు

ABN, First Publish Date - 2020-03-02T11:00:12+05:30

యాచారం మండలం తాటికుంట మైసమ్మ ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. భక్తులు వందలాదిగా అమ్మవారిని దర్శించుకొని బోనాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం: యాచారం మండలం తాటికుంట మైసమ్మ ఉత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. భక్తులు వందలాదిగా అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అటవీ ప్రాంతంలో తాటికుంట ఒడ్డున వెలిసిన అమ్మవారి ఆలయం పరిసరాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్త్తులు గుడారాలు ఏర్పాటు చేసుకుకోవడంతో సందడి నెలకొంది. అటవీశాఖ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, జడ్పీటీసీ చిన్నోల్ల జంగమ్మ, మాజీ జడ్పీటీసీ కర్నాటి రమే్‌షగౌడ్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, యాచారం సహకార సంఘం చైర్మన్‌ తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ కారింగ్‌ యాదయ్య, డైరెక్టర్‌ మద్దెల శశికళ, నందివనపర్తి సర్పంచ్‌ ఉదయశ్రీ, గున్‌గ్గల్‌ సర్పంచ్‌ ఇందిర, నాయకులు తలారి మల్లేష్‌, మల్లిఖార్జున్‌ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. జడ్పీటీసీ కొప్పు సుకన్య, తాడిపర్తి సర్పంచ్‌ రమేష్‌ అమ్మవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2020-03-02T11:00:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising