ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు

ABN, First Publish Date - 2020-08-05T09:28:23+05:30

మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు వంద కోట్ల ప్రత్యే క ప్రణాళికను అమలు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : మత్స్యకారుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు వంద కోట్ల ప్రత్యే క ప్రణాళికను అమలు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మత్స్య సమీకృత అభివృద్ధి పథకం అమలు తీరుపై ఆమె మంగళవారం తన ఛాంబర్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.52 కోట్ల ఖర్చుతో 82 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయబోతున్నట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లాలో రూ.50 లక్షలతో కోటి ఆరు లక్షల చేపపిల్లలను అందజేయనున్నట్లు చెప్పారు.


వీటిని జిల్లాలోని 536 చెరువుల్లో వేయాలని నిర్ణయించగా ప్రస్తుతం 180 చెరువుల్లో మొదటి దశలో వేయనున్నట్లు చెప్పారు. వికారాబాద్‌ జిల్లాలో 509 చెరువుల్లో కోటి 11 లక్షల చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయిం చామన్నారు. వంద శాతం గ్రాంట్‌తో చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 సంచార చేపల విక్రయ వాహనాలను అందుబాటులోకి తెస్తున్నామని, 75 శాతం రాయితీతో చేపలు అమ్ముకునేందుకు వాటిని అందిస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తి, దుర్గాప్రసాద్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-05T09:28:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising