ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్బంధ సాగువల్లే రైతు ఆత్యహత్యలు

ABN, First Publish Date - 2020-11-03T09:49:50+05:30

నియంత్రిత పంటల సాగు విధా నంతో సీఎం కేసీఆర్‌ రైతులను నిర్బంధం చేయటం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆరోపించారు. అతివృష్టితో నష్టపోయిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గడీలను పగులగొట్టయినా రైతులను కాపాడుకుంటాం

రైతుల సమస్యలపై త్వరలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం

తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన సీఎం 

రైతుల పక్షాన టీడీపీ పోరాటం

తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ


ధారూరు/పరిగి/తాండూరు/బషీరాబాద్‌ : నియంత్రిత పంటల సాగు విధా నంతో సీఎం కేసీఆర్‌ రైతులను నిర్బంధం చేయటం వల్లనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆరోపించారు. అతివృష్టితో నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు బయటకు రాని సీఎం కేసీఆర్‌ ఎలక్షన్లు, కలెక్షన్లు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం వికారా బాద్‌ జిల్లాలోని పరిగి, ధారూరు, తాండూరు, బషీరాబాద్‌ మండలాల్లో పర్యటిం చారు. ధారూరు మండలం, అంపల్లి గ్రామంలో పంటలు నష్టపోయి ఆర్థిక బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న రైతు మల్లేశం కుటుంబాన్ని ఆయన పరామర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ తరపున రూ.20వేల ఆర్థిక సహాయాన్ని మృతుడి కుటుంబానికి అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లా డుతూ.. ఆత్మహత్య చేసుకున్న మల్లేశం కుటుంబాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పలకరించిన పాపాన పోలేరని ఆయన అన్నారు.


రైతులు అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోకూడదని, ప్రగతిభవన్‌ను ముట్టడించి, గడీలు బద్దలు కొట్టి సీఎం కేసీఆర్‌ను బయటకు లాగైనా రైతులను కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. బషీరాబాద్‌ మండలం జీవన్గి గ్రామంలో పంట నష్టపోయిన రైతు భీంరెడ్డి పంట పొలాన్ని పరిశీలించారు.ప్రభుత్వం నుంచి పరిహారం అందేవిధంగా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మూడు రోజుల కిందట కరెంట్‌షాక్‌కు గురై మృతిచెందిన బాలుడు శివశంకర్‌ కుటుంబ సభ్యులను సోమవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ ఇంటికి వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. పరిగి మండలం రంగాపూర్‌ గ్రామంలో పత్తి, తదితర పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పెట్టుబడులు, జరిగిన నష్టాల గురించి తెలుసుకున్నారు. 


తాండూరులో మాట్లాడుతూ... రాష్ట్రంలో 18లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కేంద్రం నుంచి వచ్చిన బృందం రైతు సంఘాలు, రైతులతో మాట్లాడకుండా కేవలం ముఖ్య కార్యదర్శితో మాట్లాడి వెళ్లారని అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో ఏర్పడిన టీడీపీ ఏ జాతీయ పార్టీతో విలీనం కాదని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. అధికారం, అవకాశాలు వస్తుంటాయి.. పోతాయని... తెలుగు దేశం పార్టీ ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు సహజమేనని, వాటన్నింటినీ ఎదుర్కొంటూ ప్రజల కోసం పనిచేస్తున్నామని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు టీడీపీ పోటీ చేస్తుందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలిపారు. కేసీఆర్‌ మాయమాటలు ఎవరూ నమ్మరాదని పేర్కొన్నారు.  రైతాంగానికి అండగా ఉండేందుకే టీడీపీ కేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం చుట్టిందన్నారు. విపత్తుల గురించి సీఎం కేసీఆర్‌కు ముందు తెలుసునని, ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని విఫలమయ్యారని ఆరోపించారు.


రైతు సంక్షేమ పథకాల పేరిట రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియాను రైతుబంధుగా మార్చాడని రమణ ఏద్దేవా చేశారు. కొన్ని జిల్లాల్లో రైతుల తిరుగుబాటుకు భయపడి సీఎం కేసీఆర్‌ మక్కలను కొనుగోలుకు ముందుకు వచ్చారని తెలిపారు. జీహెచ్‌ఎంసీని రూ.30 వేల కోట్లతో ఆధునికీకరిస్తానని చెప్పిన కేసీఆర్‌.. ఇప్పుడు ఇళ్లలోనే ఈత కొట్టేలా చేశారని ఆరోపించారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అని అంతా నియంతపాలనగా మార్చేశాడని ఆరోపించారు. నిధులపరంగా ధనిక రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్‌ను మూడు లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చేశాడని ఆరోపించారు. కమీషన్లు కొట్టేయడం కోసమే పథకాలు తెచ్చాడని విమర్శించాడు. 


ఆయా కార్యక్రమాల్లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పి.చంద్రయ్య, చేవెళ్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు సుభాష్‌యాదవ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి రామేశ్వర్‌, కేంద్ర కమిటీ సభ్యుడు బి.వెంకటేశ్వర్లు, జగదీష్‌, వెంకట్‌రెడ్డి, కొమిరె లక్ష్మయ్య, సూరజ్‌సింగ్‌ఠాగూర్‌, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కరుణం రామకృష్ణ, ధారూరు సర్పంచు చంద్రమౌళి, టీడీపీ మండల అధ్యక్షుడు మహ్మద్‌ బాబాఖాన్‌, రాఘవులు, దివాకర్‌, కృష్ణారెడ్డి, అరవింద్‌, సుదర్శన్‌రెడ్డి, బాలకిషోర్‌, రాఘవులు, తామో దన్‌రావు అనంత్‌రెడ్డి, వెంకటేశం గౌడ్‌, ముకుంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-03T09:49:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising