ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్‌ పరీక్షలకు అంతా సిద్ధం : డీఈవో

ABN, First Publish Date - 2020-06-05T09:59:21+05:30

ఈనెల 8 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో విజయలక్ష్మి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఈనెల 8 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈవో విజయలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో 208 పరీక్ష సెంటర్లకుగాను అదనంగా 208 కేంద్రాలను పెంచాం. మొత్తం 416సెంటర్లలో 48,252మంతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం మాస్కులు, శానిటైజర్లు, సెంటర్‌కు ఒక థర్మల్‌స్కానర్‌ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే సిబ్బందికి హ్యాండ్‌ గ్లౌసులు, సెంటర్‌ను శుభ్రం చేసే ద్రవాలను సరఫరా చేశాం. విద్యార్థులు రెండు రోజుల ముందుగానే పరీక్షల సెంటర్‌ను చూసుకోవాలని తెలిపారు. ఆరోగ్య సమస్యలున్న పిల్లలకు ప్రత్యేక గది ఏర్పాటు చేశాం. కొవిడ్‌-19 వ్యాప్తిని నివారిస్తూ పరీక్షల నిర్వహణకు సీఎస్‌ అండ్‌ డీవోలకు, మిగతా సిబ్బందికి సూచనలిచ్చాం.


పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను గంట ముందే అనుమతిస్తారు. స్టూడెంట్స్‌ భౌతికదూరం పాటించాలి. అదేవిధంగా శానిటైజర్‌ను, వాటర్‌ బాటిళ్లను వెంట తెచ్చుకునేందుకు అనుమతినిస్తున్నాం. పరీక్షలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు హెల్ప్‌లైన్‌ నెంబరు 97045 59353ను ఏర్పాటు చేశాం. హాల్‌టికెట్‌ నెంబర్‌ ద్వారా ఎగ్జామ్‌ సెంటర్‌ వివరాలు చూసుకోవడానికి వెబ్‌సైట్‌  ఏర్పాటు చేశాం. 

Updated Date - 2020-06-05T09:59:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising