ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌కు కట్టుబడి ఉండాలి

ABN, First Publish Date - 2020-03-28T06:29:12+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌కు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌  అర్బన్‌ :  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌కు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. అజాగ్రత్తగా ఉంటే అనర్థాలకు దారితీసి ప్రాణా ల మీదికి వస్తుందని హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రాకరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా వైర్‌సను పూర్తిస్థాయిలో నిరోధించాలంటే ప్రజల స్వీయ నియంత్రణతోనే సాధ్యమవుతుందని సూచించారు.


ఆదిశగా ప్రజాప్రతినిధులు ప్రయత్నించాలని, పోలీసుల అనుమతితో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కరోనాకు సంబంధించి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 24 గంటల కంట్రోల్‌ రూంకు సమాచారం అందజేయాలన్నారు. 9492409781, 08418-297820కు ఫోన్‌ చేయాలన్నారు. అలాగే రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ప్రజలు 9490617234నెంబర్‌కు, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ప్రజలు 9490617440 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు విద్యాసాగర్‌, జాన్‌శాంసన్‌, డీఆర్వో మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-03-28T06:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising