డంపింగ్‌యార్డు పనులను అడ్డుకున్న గ్రామస్థులు
ABN, First Publish Date - 2020-03-16T05:57:52+05:30
ప్రభుత్వం రైతులకు కేటాయించిన పట్టా స్థలాలలో డంపింగ్‌యార్డు, వైకుంఠదామాలు ఏర్పాటు చేయడం సరైనది కాదని సింగాపూర్ గ్రామస్తులు ఆరోపించారు.
శంకర్‌పల్లి: ప్రభుత్వం రైతులకు కేటాయించిన పట్టా స్థలాలలో డంపింగ్‌యార్డు, వైకుంఠదామాలు ఏర్పాటు చేయడం సరైనది కాదని సింగాపూర్ గ్రామస్తులు ఆరోపించారు. ఆదివారం గ్రామస్తులు డంపింగ్ యార్డుకోసం పనులు జరుగుతున్న స్థలంలో ధర్నా నిర్వహించారు. అనంతర ం శంకర్‌పల్లి పురపాలక సంఘం కమిషనర్ జైత్రాంనాయక్‌కు పిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 151 లో రైతులు పంటలు పండించుకుంటూ పక్కనే బీరప్ప గుడి జాతర పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు కావాలని అధికారులను పక్కదోవ పట్టించి పట్టాభూమిలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఈ స్థలంలో కాకుండా ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీనివా్‌సరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, నవీన్‌గౌడ్, విఠల్‌రెడ్డి, ఆగంరెడ్డి, కిష్టయ్య తదితరులు ఉన్నారు.
Updated Date - 2020-03-16T05:57:52+05:30 IST