నిత్యావసరాల కొరత రానివ్వం
ABN, First Publish Date - 2020-03-27T11:56:44+05:30
నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు. కరోనా వైరస్‌పై గురువారం కలెక్టరేట్‌లో
కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు తప్పవు
అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
పశువులకు దాణా కొరత లేకుండా చూడాలి
స్వీయ నిర్బంధం పాటించి కరోనాను అరికట్టాలి
సమీక్షా సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు. కరోనా వైరస్‌పై గురువారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. జిల్లాలో 5.25 లక్షల తెల్ల రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో లబ్ధిదారుడికి 12 కిలోల చొప్పున బియ్యాన్ని అందజేస్తున్నామని, ఒక్కో రేషన్‌షాపులో రోజుకు 40మందికి పంపిణీ చేయాలని, సామాజికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చ రించారు. ఎవరైనా ధరలు పెంచి అమ్మితే కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూం, లేదా 100 డయల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రైతు బజార్లలో కూరగాయలు ఏర్పాటు చేస్తామని.. ఎవరూ ఆందోళన చెందరాదన్నారు. మార్కెట్‌లో కూరగాయలు కొనుక్కోవాలని, కొన్ని మార్కెట్‌లలో గుర్తింపు కార్డులు లేనందున మార్కెట్ వర్కర్లు పనులకు హాజరుకావడానికి విముఖత చూపుతున్నారు. పోలీసుశాఖ ద్వారా ప్రత్యేక పాసులు అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
ఎవరూ గడప దాటొద్దు
పాలు, పండ్లు, కూరగాయల కోసం మినహా ఇతర సమయాల్లో ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ప్రతిఒక్కరూ స్వీయ నియం త్రణ పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మీడియా అందిస్తున్న సహకారం, అధికారులు తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉన్నాయని ఆమె కితాబిచ్చారు. గచ్చిబౌలిలో 57, రాజేంద్రనగర్ క్వారంటైన్‌లో 64 మంది ఉన్నట్లు తెలిపారు. జిల్లాలోని అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కాలనీల్లో ఉన్న క్లబ్‌హౌస్‌లను వెంటనే మూసివేయాలని ఆదేశించారు. పశువులకు దాణా కొరత లేకుండా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కావాల్సిన ఆహార పదార్థాలను వెంటనే అందించాలన్నారు.
మహేశ్వరం నియోజక వర్గంలోని వాసవి కాలనీకి చెందిన కరోనా పాజిటివ్ వ్యక్తి గాంధీలో చికిత్స పొందుతున్నారు. ఆమెతో సబితారెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు.
33 ట్రేడర్లపై కేసులు నమోదు : కలెక్టర్ అమయ్‌కుమార్
జిల్లాలో అక్రమంగా ఆహార ధాన్యాలను నిల్వ చేసిన 33 ట్రేడర్లపై కేసులు నమోదు చేసినట్లు, రూ.22 లక్షల విలువైన ఆహార ధాన్యాన్ని సీజ్ చేశామని కలెక్టర్ అమయ్‌కుమార్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 8పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ సమా వేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు హరీష్, ప్రతీక్‌జైన్ పాల్గొన్నారు.
స్వీయ నిర్బంధం పాటించాలి : మంత్రి సబిత
మహేశ్వరం : ప్రజలు కరోనా కట్టడికి స్వీయ నిర్బంధం పాటించాలని రాష్ట్ర మంత్రి సబితారెడ్డి అన్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. రేషన్‌షాపులు, కూరగాయల మార్కెట్లను పరి శీలించారు. కరోనా కట్టడిని అడ్డంపెట్టుకొని ఆయా గ్రామాల్లో వేసిన కంచె వద్ద కూరగాయలు, పాలు, పెరుగు తీసుకువచ్చే వాళ్లను, హాస్పి టల్‌కు వెళ్లే వాళ్లను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని మహే శ్వరం సీఐ వెంకన్ననాయక్ హెచ్చరించారు. డీలర్లు రేషన్ సరుకులను ప్రజలను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందించాలన్నారు.
Updated Date - 2020-03-27T11:56:44+05:30 IST