ఉపాధి కూలీలను ఆదుకోవాలి
ABN, First Publish Date - 2020-04-25T09:18:04+05:30
లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు, పేదలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా చేయూతనందించి ఆదుకోవాలని
వ్యకాస రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కానుగుల వెంకటయ్య
తలకొండపల్లి : లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు, పేదలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా చేయూతనందించి ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కానుగుల వెంకటయ్య డిమాండ్ చేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు శుక్రవారం మండలంలోని గట్టిప్పలపల్లి గ్రామంలో ఉపాధి కూలీలతో చప్పట్ల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళలో మాదిరిగా ప్రతి కుటుంబానికి 50 కిలోల బియ్యం, 17 రకాల నిత్యావసరాలు రేషన్ కార్డుతో సంబందం లేకుండా ప్రతి కూలీకి రూ.7500 లు వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శివశంకర్, రాఘవేందర్, శ్రీను పాల్గొన్నారు.
Updated Date - 2020-04-25T09:18:04+05:30 IST