ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైవేపై మురుగు.. జాతీయ రహదారిపై నిలిచిన వర్షపు నీరు

ABN, First Publish Date - 2020-11-11T19:19:24+05:30

జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలువడంతో వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీనిపై స త్వర చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. మూడు నెలలుగా హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై కందుకూరు మండల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు

పాకురుపట్టి ప్రమాదాలబారిన పడుతున్న వాహనదారులు 


కందుకూరు(రంగారెడ్డి): జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలువడంతో వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీనిపై స త్వర చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. మూడు నెలలుగా హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై కందుకూరు మండల కేంద్రంలో నీరు నిలిచి బీటీపై రోడ్డు పాకురు పట్టిం ది. ఈ రహదారిపై వివిధ జిల్లాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వె ళ్లే భక్తులతో పాటు నాగర్‌కర్నూల్‌, జిల్లా కల్వర్తి, రంగారెడ్డి జిల్లా పరిధి ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్‌ మండల కేద్రాలతో పా టు వివిధ ప్రాంతాలకు నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుం ది. జాతీయ రహదారికి ముందు ఇక్కడ కల్వర్టు ఉండేది. ఇక్కడ పనులు చేసిన కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో ఉన్న కల్వర్టును పూర్తిగా తీసివేసి బీటీ రోడ్డు పనులు పూర్తి చేశారు.


అప్పటి నుంచి వర్షం కురిసిందంటే చాలు కందుకూరు గ్రామ పంచాయతీ నుంచి కొత్తగూడ గ్రామ పంచాయతీలోకి వచ్చే వర్షం నీరు రోడ్డుపైనే నిలిచిపోతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యపై రెండు గ్రామాల సర్పంచ్‌లు ఎస్‌.మల్లారెడ్డి, ఎస్‌ శమంతకమణి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్క రించడం లేదు. నామమాత్రంగా మోటార్‌తో వర్షం నీటిని తోడేసి చేతులు దులుపుకుంటున్నారు. శాశ్వత పరిష్కారానికి ఎలాంటి చ ర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం రోడ్డు పై వొండ్రు మట్టితో బురదగా మారింది. ఇప్పటికైనా ప్రజా ప్రతిని ధులు, అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - 2020-11-11T19:19:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising