ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి

ABN, First Publish Date - 2020-12-01T04:08:12+05:30

గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి

కమాన్‌ను ప్రారంభిస్తున్న జడ్పీటీసీ వెంకటేశ్‌, ఎంపీపీ నిర్మల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలకొండపల్లి జడ్పీటీసీ వెంకటేశ్‌, ఎంపీపీ నిర్మల

తలకొండపల్లి : గ్రామాల్లో మౌలిక సదుపాయాల క ల్పనకు ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు తోడు గా స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, దాతలు ముందుకు రావాలని తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌, ఎంపీపీ నిర్మలాశ్రీశైలంగౌడ్‌ అన్నారు. తలకొండపల్లి మండలం చీపునుంతల గేటు వద్ద  గుజ్జల బచ్చ మ్మ, లక్ష్మయ్య జ్ఞాపకార్థం  గుజ్జల మహేశ్‌ రూ.15 లక్షలు సొంత నిధులతో నిర్మించిన గ్రామ ముఖ ద్వారాన్ని సోమవారం వారు ప్రారంభించారు. సర్పంచ్‌ బండి రఘుపతి, ఎంపీటీసీ సోనిలక్య, నిర్వాహకుడు గుజ్జల మహేశ్‌ కూడా పాల్గొన్నారు. అదేవిదంగా ముఖద్వారం పైభాగంలో  ఏర్పాటుచేసిన చెన్న కేశవస్వామి, పార్వతీ పరమేశ్వరులు, దుర్గామాత విగ్రహాలనూ ఆవిష్కరించారు. అంతకుముందు ముఖద్వారం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ప్రజల సౌకర్యార్థం రూ.1.60 లక్షలతో మహేశ్‌ నిర్మించిన ఐదు మినీ వాటర్‌ట్యాంక్‌ లను, ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రా మంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో జడ్పీటీసీ, ఎంపీపీ మాట్లాడుతూ సామాజిక సేవలు సమాజంలో వ్యక్తి ప్రతిష్ఠకు దోహదపడుతాయన్నారు. పేద కుటుంబంలో పుట్టి ఆర్థికంగా ఎదిగిన మహేశ్‌ గ్రామాభివృద్ధికి, సమాజ సేవకు ముందుకు రావడం అభినందనీయమని వారు కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌, లయన్స్‌క్లబ్‌ ఉపాధ్యక్షుడు పాపిశెట్టి రాము, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు జగన్‌రెడ్డి, మిట్టపల్లి అంజయ్య, రమేశ్‌ యా దవ్‌, రమేశ్‌, శ్రీశైలం, స్వప్నాభాస్కర్‌రెడ్డి, లక్ష్మీదేవి, సోనిలక్య, రమేశ్‌, ఇమ్రాన్‌, లలితాజ్యోతయ్య, హైమావతీరామస్వామి, లక్ష్మణ్‌నాయక్‌, అంబాజీ, రఘు, వెంకటయ్య, బా లకుమార్‌గౌడ్‌, కుర్మయ్య, శేఖర్‌, దేవులానాయక్‌, రఘుపతినాయక్‌, రమేశ్‌, చంద్రశేఖర్‌, శ్రీశైలం పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T04:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising