ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో ఎవరూ పస్తులుండొద్దు

ABN, First Publish Date - 2020-04-05T09:52:00+05:30

కరోనాను అరికట్టేందకు ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్‌ విపత్కర పరిస్థితుల్లో ఏ ఒక్కరూ పస్తులుండకూడదని సీఎం కేసీఆర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాతల సహకారం మరువలేనిది

బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి


మేడ్చల్‌ :  కరోనాను అరికట్టేందకు ప్రభుత్వం చేపట్టిన లాక్‌డౌన్‌ విపత్కర పరిస్థితుల్లో ఏ ఒక్కరూ పస్తులుండకూడదని సీఎం కేసీఆర్‌ సంకల్పమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి దాతల సహకారంతో 4 వేల మంది కార్మికులకు 4 వందల క్వింటాళ్ల బియ్యంను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడ్చల్‌ జిల్లాలో పరిశ్రమలన్నీ బంద్‌ అయ్యాయని, ఉపాధి లేని ప్రతి కార్మికుడిని ఆదుకుంటామని తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ ట్యాంక్‌బాండ్‌పై వేలాది మంది కార్మికులను క్యూలో నిలబెట్టి భౌతిక దూరం పాటిస్తూ బియ్యం ప్యాకెట్లను అందజేశారు.


కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి,  వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు మద్దుల శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కండ్లకోయలో సీఎంఆర్‌ టెక్నికల్‌ క్యాంప్‌సలో కళాశాల డైరెక్టర్‌ సీహెచ్‌ గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో దాతల సహకారంతో వెయ్యి మంది కార్మికులకు వంద  క్వింటాళ్ల బియ్యంను ఉచితంగా అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అభినందనీయమని మంత్రి అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-05T09:52:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising