ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి’

ABN, First Publish Date - 2020-10-03T09:34:14+05:30

ఉపాధిహామీ నుంచి తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ కార్మిక సంఘం 

జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య


పరిగి/కొడంగల్‌/తాండూరు: ఉపాధిహామీ నుంచి  తొలగించిన  ఫీల్డ్‌ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం పరిగిలో వికారాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. 


రాష్ట్రంలో 7 వేల మంది ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.  కార్యక్రమంలో  బి.చంద్రయ్య, గోవింద్‌నాయక్‌,  శ్రీనివాస్‌, రాఘవేందర్‌, రాందాస్‌, ఖాధీర్‌ పాల్గొన్నారు. కొడంగల్‌లో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ నాయకులు బాలప్ప, నారాయణ తదితరులు ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డికి శుక్రవారం వినతి పత్రం అందించారు. తాండూరులో వ్యవసాయ కార్మికసంఘం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకునే విషయమై చర్చించారు. సమావేశంలో యు.బుగ్గప్ప, కె.శ్రీనివాస్‌, రాంజినాయక్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T09:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising