ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరణి సేవలను వేగవంతం చేస్తాం

ABN, First Publish Date - 2020-12-03T05:24:35+05:30

ధరణి సేవలను వేగవంతం చేస్తాం

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పాత రిజిస్ర్టేషన్ల మ్యుటేషన్ల కోసం మీ సేవల్లో దరఖాస్తు చేసుకోవాలి
  • జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

చేవెళ్ల: ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి సేవలను ప్రజలకు మరింత సులభతరం చేస్తామని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం చేవెళ్ల ఆర్‌డీవో కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. భూరిజిస్ర్టేషన్‌ విధానం ప్రజలకు సులభతరం చేసేందుకు ధరణిని అమలు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో దరణి సేవలను మరింత వేగవంతం చేస్తామన్నారు. వ్యవసాయేతర రిజిస్ర్టేషన్లు సైతం తొందరలోనే ప్రారంభం అవుతాయని చెప్పారు. గతంలో రిజిస్ర్టేషన్‌ చేసుకున్న మ్యుటేషన్‌ కోసం మీసేవ కేంద్రా ల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 663 మ్యుటేషన్‌ అప్లికేషన్లు వచ్చాయన్నారు. షాబాద్‌ మండలం చందనవెల్లి భూసేకరణలో రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని త్వరలో అందిస్తామని తెలిపారు. ఇంకా 30ఎకరాల భూమికి సంబంధించి కోర్టు కేసు ఉందన్నారు. షాబాద్‌ మండలంలో ఆర్‌ఎ్‌సఆర్‌ అధికంగా ఉందని, వాటిని తొందరలోనే పరిష్కరిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వర్తించామన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్‌రావు ఉన్నారు. 

Updated Date - 2020-12-03T05:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising