ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుంజుకుంటున్న ‘ధరణి’

ABN, First Publish Date - 2020-11-21T04:36:25+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్‌ ద్వారా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజుకు 70 నుంచి 90 మధ్య రిజిస్ట్రేషన్లు 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్‌ ద్వారా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన నాటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు వికారాబాద్‌ జిల్లాలో మొత్తం 1007 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన 2వ తేదీన 5 రిజిస్ట్రేషన్లు జరిగితే, ప్రస్తుతం రోజుకు 70 నుంచి 90 మధ్యన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రారంభంలో ఎదురైన సాంకేతిక సమస్యలు క్రమంగా పరిష్కారం కావడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 15రోజుల్లో రిజిస్ట్రేషన్‌, వారసత్వం, భాగం వాటా కోసం 1,046 స్లాట్‌లు బుక్‌ చేసుకుంటే వాటిలో 1,007 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. కొనుగోలు, బహుమతి రిజిసే్ట్రషన్ల కోసం 965 స్లాట్‌లు బుక్‌ చేసుకోగా, వాటిలో 929 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. వారసత్వం కోసం 76స్లాట్‌లు బుక్‌ చేసుకోగా, వాటిలో 73 పూర్తయ్యాయి. భాగం వాటా కోసం 5స్లాట్‌లు బుక్‌ చేసుకోగా, వాటిలో 5 పూర్తయ్యాయి. వివిధ కారణాలతో 39 రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈనెల 2న 5 రిజిస్ట్రేషన్లు జరిగితే, 3న 26, 4న 28, 5న 43, 6న 63, 7న 61 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 9న 77, 10న 59, 11న 87, 12న 87, 13న 78 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. 16న 50, 17న 57, 18న 69, 19న 72, 20న 67 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అదే వారసత్వానికి సంబంధించి 10న 3, 11న 12, 13న 4, 16న 13, 17న 15, 18న 6, 19న 4, 20న 10 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. అదే భాగం వాటాకు సంబంధించి 10న 1, 12న 1, 17న 1, 18న 1, 19న 1 రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. జిల్లాలో బుక్‌ చేసిన స్లాట్లలో 96.27 శాతం రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాయి. 


రిజిస్ట్రేషన్లలో వేగం పెరిగింది


ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన తరువాత ప్రారంభంలో ఎదురైన సమస్యలు క్రమంగా దూరమయ్యాయి. రోజూ జరిగే రిజిస్ట్రేషన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తరువాత మ్యుటేషన్‌ కోసం రైతులు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ధరణితో ఆ సమస్య దూరమైంది. రిజిస్ట్రేషన్‌ పూర్తి కాగానే మ్యుటేషన్‌ కూడా జరిగిపోతోంది. 

- మోతీలాల్‌, జిల్లా అదనపు కలెక్టర్‌, వికారాబాద్‌

Updated Date - 2020-11-21T04:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising