టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి
ABN, First Publish Date - 2020-12-16T05:19:28+05:30
టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు.
మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్
మోమిన్‌పేట: టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మోమిన్‌పేట మండల కేంద్రం నుంచి చంద్రాయన్‌పల్లి, రావులపల్లి, కోల్కుంద గ్రామాలను కలుపుతూ రూ.3.24 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, ఎంపీపీ దబ్బని వసంతవెంకట్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం మండల, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు విఠల్, లక్ష్మయ్య, అంజిరెడ్డి, సర్పంచులు అంగేరి శ్రీనివాస్‌రెడ్డి, కర్ణం పార్వతమ్మ, అంజయ్య, సురేష్, శశిధర్, కాశీరాం, ఎంపీటీసీలు క్రిష్ణారెడ్డి, కుషాల్‌కుమార్, గోవర్ధన్‌రెడ్డి, బాగ్దాద్, కర్ణం రామకృష్ణ, భుజంగం, వెంకట్, నర్సింలు, మల్లేషం, క్రిష్ణ, బక్కారెడ్డి, జనార్థన్‌రెడ్డి, అనంతయ్య పాల్గొన్నారు.
27 నుంచి ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు
ఈనెల 27వ తేదీ నుంచి రైతుబంధు డబ్బులు రైతుల అకౌం ట్లలో జమ అవుతాయని మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మోమిన్‌పేట మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న మంత్రి దేవరంపల్లి రహదారిపై కూరగాయలు అమ్ముతున్న రైతులతో ముచ్చటించారు. కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అమ్ముడు పోతున్నాయి అని అడగగా నగరం వైపు వెళ్లేవారు. వాహనదారులు తాజా కూరగాయలు కొనేందుకు ఇష్టపడతారని రైతులు పేర్కొన్నారు.
Updated Date - 2020-12-16T05:19:28+05:30 IST