ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహ్లాదకర పుణ్యక్షేత్రం ‘దామగుండం’

ABN, First Publish Date - 2020-11-21T03:51:26+05:30

గ్రామసీమల మధ్య ప్రకృతి రమణీయతను కనువిందు కలిగించే సువిశాల ప్రదేశం. గలగల పారే సెలయేరులు... పక్షుల కిలకిలలు..

దామగుండంలో వెలసిన రామలింగేశ్వరుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కార్తీక మాసంలో ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ


పరిగి/పూడూరు: గ్రామసీమల మధ్య ప్రకృతి రమణీయతను కనువిందు కలిగించే సువిశాల ప్రదేశం. గలగల పారే సెలయేరులు... పక్షుల కిలకిలలు.. పచ్చని చెట్లు.... ఆహ్లాదాన్ని కలిగించే వాతావరణంలో ఎవరైనా కాసేపు గడపాలని అనుకుంటారు. అలాంటి ప్రాంతం పూడూర్‌ మండల కేంద్రానికి 2కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే దామగుండం పుణ్యక్షేత్రం. వికారాబాద్‌ జిల్లా వాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది ఇక్కడికి వస్తుంటారు. అయితే ప్రస్తుతం కార్తీకమాసం కావడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. ఈ క్షేత్రానికి సుమారు 800ఏళ్ల ఘనమైన చరిత్ర ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది. పూర్వం ఒక మునీశ్వరుడు ఈ దేవాలయం ఉత్తరం వైపున ఉన్న గుహలో తపస్సు చేసినట్లు చెప్పుకుంటారు. ఈ గుహ ఇప్పటికీ ఉంది. అదేవిధంగా ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణిలో స్నానమాచరిస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. 


ఎప్పుడూ ఒకే కాలంగా..


అడవి మధ్యలో లోతైన ప్రాంతంలో దామగుండం శివాలయం, ఆ పక్కనే పెద్ద నీటికొలను ఉంది. అయితే ఈ కొలను మాత్రం సంవత్సరం పొడవునా నీటితో కళకళ లాడుతూ ఉంటుంది. ఈ గుండానికి మరో చరిత్ర కూడా ఉంది. ఈ గుండం మధ్యలో ఒక చిన్నగుడి ఉంది. ఆ గుడిలో శివలింగం ప్రతిష్ఠించి ఉంది. అయితే ఆ లింగం ఉన్న గుడి మీదుగా ఎవరూ కూడా రాయిని ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు విసరలేరని, ఒకవేళ విసి రిన వారు అదృష్టవంతులని అంటారు. ఇక్కడ ప్రతిఏటా శ్రావణమాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. సాయంత్రం మాత్రం ఆ ప్రాతంలో ఒక వ్యక్తి, పూజారి తప్పిస్తే మరేవరూ ఉండరు.


ఈ  క్షేత్రానికి ఇలా చేరుకోవాలి


పూడూర్‌లోని దామగుండ రామలింగేశ్వర ఆలయం హైదరాబాద్‌కు 60కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి రావాలంటే నగరంలోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి పరిగి, వికారాబాద్‌, తాండూర్‌  వచ్చే బస్సు ఎక్కి మన్నె గూడ బస్‌స్టేషన్‌లో దిగాలి. అక్కడి నుంచి ఈ క్షేత్రానికి వచ్చేందుకు ఆటోలు, ప్రైవేట్‌వాహనాలు ఉంటాయి. 

Updated Date - 2020-11-21T03:51:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising