కరోనా కలవరం..
ABN, First Publish Date - 2020-10-04T05:37:34+05:30
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా చావులు పెరుగుతున్నాయి. శనివారం మరోఇద్దరు కరోనా కాటుకు బలయ్యారు.
రంగారెడ్డి జిల్లాలో ఒకరు, వికారాబాద్‌లో మరొకరు మృతి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా చావులు పెరుగుతున్నాయి. శనివారం మరోఇద్దరు కరోనా కాటుకు బలయ్యారు. రంగారెడ్డిజిల్లాలో ఒకరు మృతి చెందగా వికారా బాద్‌లో మరొకరు మృతి చెందారు. మూడుజిల్లాలో మొత్తం ఇప్పటి వరకు మృతుల సంఖ్య 265కు చేరు కుంది. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా శనివారం 695 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 310, మేడ్చల్ జిల్లాలో 357, వికారాబాద్ జిల్లాలో 28 కేసులు నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు.
ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, చేవెళ్ల డివిజన్‌న్లలో...
ఇబ్రహీంపట్నం/షాద్‌నగర్/చేవెళ: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో శనివారం 11 కేంద్రాల్లో కరోనా యాంటీజెన్ టెస్టులు నిర్వహించగా 57మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇబ్ర హీంపట్నం సీహెచ్‌సీలో15, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 9, యాచారంలో ముగ్గురికి, మంచాలలో ఒకరికి, ఆరుట్లలో ముగ్గురికి, దండుమైలారంలో ముగ్గురికి, ఎలిమినేడులో 5, మాడ్గులలో ఇద్దరికి, సీహెచ్‌సీ హయత్‌నగర్‌లో 4, తట్టిఅన్నారంలో 5, రాగన్నగూడలో ఏడుగురికి పాజిటివ్ అని తేలింది. షాద్‌నగర్ డివిజన్‌లో 246 మందికి పరీక్షలు నిర్వహించగా 28 మందికి పాజిటివ్ వచ్చింది. వారిలో షాద్‌నగర్‌కు చెందిన 13, కొత్తూర్ మండలానికి చెందిన 8, కేశంపేటమండలానికి చెందిన నలుగురు, నందిగామ మండలానికి చెందిన ముగ్గురు ఉన్నారు. చేవెళ్ల డివిజన్‌లో 260 మందికి పరీక్షలు చేయగా18 మందికి పాజిటివ్ వచ్చింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 29మందికి పరీక్షలు చేయగా 7,శంకర్‌పల్లి మండలంలో 55 మం దికి పరీక్షలు చేయగా 6, మొయినాబాద్ మండలంలో 46 మందికి పరీక్షలు చేయగా 4, షాబాద్ మండలంలో 61 మందికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు.
మండలాల పరిధిలో...
కందుకూరు/ఆమనగలు/శంషాబాద్/కులకచర్ల : కందుకూ రు పీహెచ్‌సీలో 25 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. వారిలో కందుకూరు గ్రామానికి చెందిన ఇద్దరు. గుమ్మడవెళ్లికి చెందిన ఒకరుగా వైద్యులు నిర్ధా రించారు. ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కడ్తాల, తలకొండపల్లి, ఆమనగల్లు, మండలాల పరిధిలోని 31మందికి పరీక్షలు నిర్వ హించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. వారిలో ఆమనగల్లు, మహేశ్వరం మండలం కల్వకోలు, హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన ఒక్కొక్కరున్నారు. శంషాబాద్ మున్సిపల్ పరిధిలో 74 మంది పరీక్షలు చేయగా రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డాక్టర్ నజ్మాభాను తెలిపారు. కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 22 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో బండమీది తండాకు చెందిన యువకుడికి పాజిటివ్ వచ్చినట్ల్లు వైద్యాధికారి మురళీకృష్ణ తెలిపారు.
గాంధీలో కరోనాతో వృద్ధురాలి..
కరోనాపాజిటివ్ వచ్చిన కులకచర్లకు చెందిన వృద్ధ్దురాలు(70) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈనెల1న మృతురాలి కుటుంబీకులు కులకచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆఇంట్లో అందరికి నెగిటివ్‌రాగా వృద్ధురాలికి పాజిటివ్ వచ్చింది. ఆమెను అంబులెన్స్‌లో గాంధీకి తరలించారు.చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్ సౌమ్యారెడ్డి, ఉప సర్పంచ్ పండరయ్యచారి గ్రామంలో శానిటైజ్ చేయించారు.
Updated Date - 2020-10-04T05:37:34+05:30 IST