ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రారంభమెప్పుడో..?

ABN, First Publish Date - 2020-09-19T09:33:17+05:30

పరిగి పట్టణంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్ర భవనం ప్రారంభానికి నోచక అలంకారప్రాయంగా మారింది. ఒకవైపు కరోనా పాజిటివ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదు కోట్లతో కొత్త ఆస్పత్రి భవనం నిర్మాణం

పూర్తయి నాలుగేళ్లు.. ఇంకా ప్రారంభించని వైనం

కరోనా రోగులకు వసతులు లేక ఇబ్బందులు 


పరిగి: పరిగి పట్టణంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్ర భవనం ప్రారంభానికి నోచక అలంకారప్రాయంగా మారింది. ఒకవైపు కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి భవన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే, నిర్మించిన భవనాన్ని వినియోగంలోకి తీసుకురావడంతో అధికారులు విఫలమవుతున్నారు. అన్నిరకాల వసతులతో నిర్మించిన భవనాన్ని వినియోగంలోకి ఎందుకు తీసుకురావడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 


పరిగి పాత ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో ఐదేళ్ల క్రితం అప్పటి వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి కొత్తగా 30పడకల ఆస్పతి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి విధితమే. ఏడాదిలోపు వినియోగంలోకి తీసుకురావాలని అప్పట్లో మంత్రి ఆదేశించారు. రూ.3.50 కోట్లతో భవనం, రూ.1.50 కోట్లతో పరికరాల కోసం  కేటాయించారు. అయితే భవన నిర్మాణం పూర్తయి నాలుగేళ్లయినా... ఎందుకు ప్రారంభించడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. కొత్తగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించాలని గతంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన సంగతి విధితమే. నూతనంగా నిర్మించిన భవనాన్ని ప్రారంభించాలని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండాపోయింది. పరిగి ఆస్పత్రికి నిత్యం నాలుగువందలకుపైగా ఓపి రోగులు వస్తుంటారు. ఆస్పత్రిలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా నిర్మించిన భవనాన్ని వినియోగంలోకి తీసుకువస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని తెలిసినా ప్రారంభించడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు. 


అధికారులు స్పందించి వినియోగంలోకి తీసుకురావాలి-ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు 

పరిగిలో రూ.5 కోట్లతో ఆస్పత్రి భవనం నిర్మించి ఐదేళ్లు కావొస్తున్నా ఎందుకు ప్రారంభించడం లేదు. కొవిడ్‌-19 పాజిటివ్‌ బాధితులకు బెడ్లు లేక అవస్థలు పడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 30పడకల స్థాయిలో నిర్మించిన 150 బెడ్ల వరకు వినియోగించుకునే అవకాశం ఉంది. పాతది కూలిపోయే స్థితిలో ఉందని, రోగులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్‌ స్పందించి కొత్త భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. 

Updated Date - 2020-09-19T09:33:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising