ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితుల ఆందోళన

ABN, First Publish Date - 2020-11-01T06:42:30+05:30

వరదలతో నష్టపోయిన వారందరికీ పరిహారం చెల్లించాలని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని భవానీనగర్‌ కాలనీవాసులు ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నష్టపోయిన వారందరికీ  పరిహారం చెల్లించాలి 

దమ్మాయిగూడ మునిసిపాలిటీ ఎదుట భవానీనగర్‌ కాలనీ వాసుల నిరసన


కీసర రూరల్‌ : వరదలతో నష్టపోయిన వారందరికీ పరిహారం చెల్లించాలని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని భవానీనగర్‌ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. శనివారం కాలనీవాసులు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద ధాటికి కాలనీలో దాదాపు ఇళ్లన్నీ నీటిలో మునిగినప్పటికీ, కొందరికే నష్టపరిహారం చెల్లించటమేంటని అధికారులను నిలదీ శారు. కమిషనర్‌, చైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. వైస్‌చైర్మన్‌ మాదిరెడ్డి నరేందర్‌రెడ్డి కల్పించుకుని ఆందోళనకారులతో చర్చించి, ప్రస్తుతపరిస్థితుల గురించి వారికి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ  ఇంట్లో వస్తువులన్నీ వరదనీటిలో తడిశాయని, వారంరోజుల పాటు మురుగులోనే గడిపినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి చూడలేదని  ఆవేదన వ్యక్తం చేశారు.


నాయకులకు అనుకూలంగా ఉండే వారికి మాత్రమే  ప్రభు త్వం ఇస్తున్న రూ. పదివేలు ముట్టచెప్తున్నారని ఆరోపించారు. ఇదే విషయమై మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ ప్రణీత, కమిషనర్‌ స్వామిలను వివరణ  కోరగా మున్సిపల్‌ పరిధిలో మొత్తం 786 మందిని వరద బాధితులుగా గుర్తించామని, అందులో 300మంది భవానీ నగర్‌లోనే ఉన్నారన్నారు. వారిలో 100 మందికి పరిహారం అందజేయటం జరిగిందని తెలిపారు. మిగతా వారికి పంపిణీ చేయాల్సి ఉందని వెల్లడించారు. అని వార్య కారణాలవల్ల  వరదబాధితులకు పరిహారం పంపిణీని వాయిదా వేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. దీంతో బాధితులకు డబ్బుల చెల్లింపులను నిలిపివేసినట్లు తెలిపారు. తదుపరి ఆదేశాల మేరకు పంపిణీ  చేస్తా మని వారు వివరించారు.

Updated Date - 2020-11-01T06:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising