ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజసేవే లక్ష్యంగా ముందుకు సాగాలి

ABN, First Publish Date - 2020-11-30T05:22:47+05:30

సమాజసేవే లక్ష్యంగా ముందుకు సాగాలి

మాట్లాడుతున్న రాచకొండ కమిషనర్‌ మహేష్‌భగవత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌


ఘట్‌కేసర్‌ రూరల్‌: సమాజసేవే లక్ష్యంగా యువత ముందుకుసాగాలని రాచకొండ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ అన్నారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలం, వెంకటాపూర్‌ అనురాగ్‌ విశ్వవిద్యాలయంలో ఈనెల 19నుంచి 29వరకు జరిగిన ఫ్రీ రిపబ్లిక్‌ పేరేడ్‌- 2020 ముగింపు వేడుకలకు ఆదివారం సాయంత్రం ఆయన ముఖ్యఅతిథిగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ముఖ్యంగా యువత సమాజ సేవే లక్ష్యంగా ముందు సాగాలని కోరారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని దేశానికి సేవచేయాలన్నారు. యువత లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సాగాలని, అప్పుడే దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఈ ముగింపు కార్యక్రమంలో ఆరు రాష్ట్రాల నుంచి 200 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర అధికారి డాక్టర్‌ కె.రమేష్‌రెడ్డి, అనురాగ్‌ విశ్వవిద్యాలయం  డైరెక్టర్‌ కెఎస్‌.రావు, డైరెక్టర్‌ అఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌ అనురాగ్‌ పల్లా, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ చెన్నకేశ మల్లేష, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-30T05:22:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising