సీఎం.. హామీలు అమలు చేయాలి
ABN, First Publish Date - 2020-12-29T04:44:07+05:30
సీఎం.. హామీలు అమలు చేయాలి
- బీజేపీ ఆధ్వర్యంలో వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ధర్నాలు, నిరసనలు...
- తహసీల్దార్లకు వినతి పత్రాల ఆందజేత
ధారూరు/వికారాబాద్ /బంట్వారం/నవాబుపేట/పెద్దేముల్ /కులకచర/పరిగి/దౌల్తాబాద్ : సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండు చేస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ధారూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈసందర్బంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్ మాట్లాడుతూ దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి పంపీణీ చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు.కార్యక్రమంలో రవీందర్‌గౌడ్, ఎన్.విశ్వనాథం, నరేందర్ రెడ్డి, రాజేందర్ గౌడ్, ఎం.రమేశ్, శ్రీకాంత్, శివమణి, శ్రీనివాస్, రఘుపతి, కమాల్‌రెడ్డి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్‌లో తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ దళిత మోర్చా వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు నవీన్‌కుమార్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్, అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, నాయకులు నరోత్తంరెడ్డి, సుచరితరెడ్డి, కొత్తపల్లి నరసింహులు, మహిపాల్‌రెడ్డిపాల్గొన్నారు. బంట్వారంలో పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మహే్‌షయాదవ్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, పాల్గొన్నారు. నవాబుపేటలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సార జగన్ తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, సంతో్‌షరెడ్డి, బందయ్య, రాములు, నర్సింహాచారి, పాండురంగరెడ్డి, చంద్రకాంత్, కావలి రవీందర్, శేఖర్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. శేఖర్, మల్లేషం, రాజు, సిద్ధార్థ, వీరేశం, నాగరాజు పాల్గొన్నారు. పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ అధ్యక్షుడు సందీప్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు బైఠాయించి నిరసన వ్యక్త చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివా్‌సకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి హరీ్‌షగౌడ్, రాము, వీరు, అనిల్, సాయి, బసంత్‌రెడ్డి, అనిల్‌రెడ్డి, ప్రదీప్, మల్లేష్, రాము పాల్గొన్నారు.కులకచర్ల తహసీల్దార్ కార్యాలయంలో దళిత మోర్చా ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు. కార్యక్రమంలో మైపాల్, వెంకటయ్యగౌడ్, సౌమ్యావెంకట్‌రాంరెడ్డి, బందయ్య, బిచ్చన్న, సురేందర్‌గౌడ్, లక్ష్మయ్య, ఆంజనేయులు, భీమయ్య, రాజశేఖర్ పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో పరిగి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రాంచందర్, హరికృష్ణ, పెంటయ్య, ఆంజనేయులు, రమేశ్, బాలకిష్టారెడ్డి, డి.రమేశ్, జనార్ధన్‌రెడ్డి, సాయి, మల్లేశ్ పాల్గొన్నారు. దౌల్తాబాద్ తహసీల్దార్ కార్యాలయ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సతీశ్‌ముదిరాజ్, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కూరవెంకటయ్య, కుండ్రునర్సింహులు తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందించారు. ధర్నాలో సత్యప్ప, సాయప్ప, కిష్టప్ప, వెంకటప్ప, గోపాల్, వెంకటప్ప, చింతకిందిగోపాల్, గోవిందు పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లాలో నిరసనల వెల్లువ
ఘట్‌కేసర్ రూరల్/శామీర్‌పేట/కీసర : దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ మండల అధ్యక్షుడు చలువాది ప్రవీణ్‌రావు ఆరోపించారు. ఘట్‌కేసర్ తహసీల్దారు కార్యాలయం ఎదుట సోమవారం డబుల్‌బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూపంపిణీ చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమబంలో ఎంపీటీసీ కొమ్మిడిశోభారాణి, గుడ్ల బాల్‌రాజ్, కాలేరు రామోజీ, శ్రీనివా్‌సరెడ్డి, దామోదర్‌రెడ్డి, రవికాంత్‌రెడ్డి, హనుమాన్ పాల్గొన్నారు. శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు కైర యాదగిరి, పట్నం నర్సింహారెడ్డి, శివ, హైమరెడ్డి, సునీతానాయక్, తుంకి భాస్కర్, మహంకాలి నర్సింగ్‌రావు, కుంట యాదగిరి, జంగారెడ్డి, తుమ్మ వివేకానంద, సొప్పరి నగేష్, కీసర నర్సింగ్‌రావు, రూప్‌కుమార్, అశోక్, యాదగిరి పాల్గొన్నారు. కీసర మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ గౌరీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు దేశం మల్లే్‌షగౌడ్, ప్రధాన కార్యదర్శులు బాపురెడ్డి, బాల్‌రాజ్ పాల్గొన్నారు.
Updated Date - 2020-12-29T04:44:07+05:30 IST