ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూసి ఉన్న సినిమా థియేటర్లు

ABN, First Publish Date - 2020-03-16T06:12:26+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన వైరస్‌ ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, విద్యార్థుల వసతి గృహాలు, సినిమా హాళ్లు తదితర వాటికి ప్రభుత్వం ఈ నెల 31 వరకు మూసి ఉంచాలని ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైర్‌సపై విస్తృతంగా చర్చించుకుంటున్న ప్రజలు


చేవెళ్ల: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన వైరస్‌ ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలు, విద్యార్థుల వసతి గృహాలు, సినిమా హాళ్లు తదితర వాటికి ప్రభుత్వం ఈ నెల 31 వరకు మూసి ఉంచాలని ఆదేశించింది. అయి తే చేవెళ్ల డివిజన్‌లో ఉన్న చేవెళ్ల, షాబాద్‌, శ ంకర్‌పల్లి, మొయినాబాద్‌ తదితర మండలా ల్లో ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఆయా పాఠశాలల కు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు ఎస్‌ఎంఎ్‌సలు, వాట్సాప్‌ మేసెజ్‌లు పంపించారు. అలాగే చేవెళ్లలో గల కస్తూర్బా గాంధీ వసతి గృహంలో పదో తరగతి విద్యార్థినిలు మినహా ఇతర తరగతుల బాలికలను వారి తల్లిదండ్రులతో ఇళ్లకు పం పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేవెళ్ల, శం కర్‌పల్లి తదితర మండలాల్లో ఉన్న నాలుగు సినిమా థియేటర్లు మూసి ఉంచారు. ఈచ  నేపథ్యంలో ఎవరు గుమికూడినా, ఎక్కడ చూసినా ప్రజలు కరోనా వైరస్‌ పైనే మాట్లా డుకుంటున్నారు.


మూసి ఉంచిన థియేటర్లు..  నిరాశగా వెనుదిరిగిన ప్రేక్షకులు

షాద్‌నగర్‌:  కరోనా వైరస్‌ ప్రభావంతో శనివా రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌ ప్రత్యేక సమావేశంలో తీసుకున్న ని ర్ణయాల మేరకు ఆదివారం షాద్‌నగర్‌ పట్టణంలో సినిమా థియేటర్లు మూతపడ్డాయి. పలు గ్రామాల నుంచి సినిమా చూడడానికి వచ్చే గ్రామీణ ప్రేక్షకులు నిరాశతో వెనుదిరి గారు. ఆదివారం మంచి ముహూర్తం అని చాలా వివాహాలు జరిపించారు. కరోనా భయ ంతో పెళ్లిళ్లకు కూడా చాలా మంది హాజరు కాలేదు. వచ్చిన వారిలో కొందరు మాస్కులు ధరించి రావడం గమనార్హం.

Updated Date - 2020-03-16T06:12:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising