ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం

ABN, First Publish Date - 2020-12-04T05:04:10+05:30

పేదల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం

చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్సీ నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి 

ఆమనగల్లు : పేదల జీవన ప్రమాణాల పెంపు, వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు సత్ఫలితాలిస్తున్నాయని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అవినీతి రహిత, పారదర్శక పాలనే ధ్యేయంగా ప్రభుత్వం అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు, కల్వకుర్తి, కడ్తాల్‌, తలకొండపల్లి మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను గురువారం నగరంలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు నారాయణరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు సుమన్‌, ఎజాజ్‌, శంషు, సురేందర్‌రెడ్డి, వెంకట్‌ రెడ్డి, రవీందర్‌, బాబా, తదితరులు పాల్గొన్నారు. కాగా, కడ్తాల మండలం మైసిగండికి చెందిన ఆర్‌.కల్యాణికి రూ.లక్ష, బాలాజీ నగర్‌ తండాకు చెందిన వి.దేవ్‌సింగ్‌కు రూ.50 వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరయ్యాయి. ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ గురువారం నగరంలోని తన నివాసంలో బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైసిగండి సర్పంచ్‌ తులసీరాం నాయక్‌, నాయకులు జంగయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:04:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising