ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అస్తవ్యస్తంగా అంతర్గత రోడ్లు

ABN, First Publish Date - 2020-10-19T09:13:35+05:30

మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం... కాంట్రాక్టర్ల నిర్వాకంతో ఇప్పటికే మున్సిపాలిటీలోని అంతర్గత రోడ్లు పూర్తిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్షాలకు కొట్టుకుపోయిన మట్టి రోడ్లు

లోపించిన పారిశుధ్యం.. ప్రజల ఇబ్బందులు


షాద్‌నగర్‌: మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం... కాంట్రాక్టర్ల నిర్వాకంతో ఇప్పటికే మున్సిపాలిటీలోని అంతర్గత రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటీవలి భారీ వర్షాలకు రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయి. గృహా ల మధ్యలో వర్షపు నీటి గుంటలు ఏర్పడ్డాయి. చాలా కాలనీల్లో ఇళ్ల మధ్యనే మురుగునీరు చెరువులను తలపిస్తోంది. దీంతో పారిశుధ్యం లోపిస్తోంది. ఈగలు, దోమలు పెరిగి పట్టణ ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు.


వాహన చోదకులకు ఇబ్బందులు

రోడ్లన్నీ గుంతలమయం కావడంతో వాహనచోదకులు ప్రమాదా లకు గురవుతున్నారు. పలు చోట్ల వేసిన సీసీ రోడ్లు నాణ్యతా లోపం తో మూన్నాళ్లకే దెబ్బతిన్నాయి. డ్రైయిన్లు లేక మురుగునీరు వర్షపు నీటితో కలిసి రోడ్లపై పారుతోంది. వర్షాలతో పలు ప్రాంతాలు దుర్గంధభరితంగా మారాయి. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కాలనీల్లో నీరు నిలవకుండా అంతర్గత రోడ్ల కు మరమ్మతులు చేపట్టాలని, కొన్ని ప్రాంతాల్లో ఏర్పడిన నీటి గుం టలను పూడ్చివేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

Updated Date - 2020-10-19T09:13:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising