కాశీంపూర్, మల్కన్‌గిరిలో కేంద్ర బృందం పరిశీలన
ABN, First Publish Date - 2020-12-11T05:36:39+05:30
కాశీంపూర్, మల్కన్‌గిరిలో కేంద్ర బృందం పరిశీలన
మిషన్ భగీరథ అమలు తీరుపై ఆరా తీస్తున్న కేంద్రం బృందం
బషీరాబాద్: మిషన్ భగీరథ నీటి సరఫరా పథకం అమలు తీరు, పరిశీలన కోసం జల జీవన మిషన్ కేంద్ర అధికారుల బృందం గురువారం బషీరాబాద్ మండలంలో పర్యటించింది. ఈసందర్భంగా కేంద్ర బృందం అధికారులు సురేష్, రమేష్ కాశీంపూర్, మల్కన్‌గిరి గ్రామాల్లో స్థానిక సర్పంచ్ సి.వెంకటయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ రమేష్, భావనతో కలిసి పలు ఇళ్ల వద్దకు వెళ్లారు. ఇంటింటా పథకం అమలును స్వయంగా పరిశీలిస్తూ అక్కడి కుటుంబసభ్యులతో నీటి సరఫరా గురించి అడిగి తెలసుకున్నారు. అనంతరం నీటి నాణ్యతా ప్రమాణాలపై ఆరా తీశారు.
Updated Date - 2020-12-11T05:36:39+05:30 IST