ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బేకరీ పరిశ్రమ నుంచి ఒక్కసారిగా బయటికొచ్చిన మరిగే వ్యర్థ జలాలు.. చివరకు..

ABN, First Publish Date - 2020-07-13T14:40:28+05:30

పరిశ్రమలో రియాక్టర్‌ పేలిన ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మేకగూడ శివారులో గల హిమాక్షి బేకరి పరిశ్రమలో ఆదివారం చోటుచేసుకున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిమాక్షి బేకరి పరిశ్రమలో పేలిన రియాక్టర్‌ 

నలుగురు కార్మికులకు తీవ్రగాయాలు 

ఇద్దరి పరిస్థితి విషమం 


నందిగామ (రంగారెడ్డి): పరిశ్రమలో రియాక్టర్‌ పేలిన ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మేకగూడ శివారులో గల హిమాక్షి బేకరి పరిశ్రమలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరిశ్రమలో ముడిసరుకుతో మోనాక్సైడ్‌ గ్యాస్‌ను తయారు చేసే రియాక్టర్‌ నుంచి ఒక్కసారిగా మరిగే వేడి వ్యర్థ జలాలు, ఆయిల్‌ బయటకి రావడంతో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమబెంగాల్‌ రాష్ర్టానికి చెందిన సునిల్‌సింగ్‌, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌, యాదవచారి, ఏపీకి చెందిన కోటేశ్వరావులు ఉన్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబా ద్‌లోని డీఆర్‌ డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. పరిశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న కార్మిక సంఘాలు గాయపడిన కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులక భద్రతకు యాజమాన్యం ఎలాంటి రక్షణ పరికరాలను సమకూర్చడం లేదంటూ కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు.

Updated Date - 2020-07-13T14:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising