ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇబ్బందులుంటే నా దృష్టికి తీసుకురండి

ABN, First Publish Date - 2020-04-04T09:42:25+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రతి రోజు ఉదయం 11.30 గంటల నుండి 12 గంటల వరకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ పౌసుమి బసు


వికారాబాద్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రతి రోజు ఉదయం 11.30 గంటల నుండి 12 గంటల వరకు నేరుగా డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో ఫిర్యాదు చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్‌ పౌసుమి బసు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి ఐదు ఫిర్యాదులు వచ్చాయి.


నవాబుపేట మండలంలో రేషన్‌ బియ్యం సరిగ్గా పంపిణీ కావడం లేదని చెప్పగా, కలెక్టర్‌ స్పందిస్తూ గుమ్మిగూడకుండా ఉండేందుకు టోకెన్లు ద్వారా బియ్యం తీసుకోవాలని సూచించారు. తాండూరు పట్టణంలోని 27వ వార్డులో గల బాలాజీ ఆసుపత్రి వద్ద చెత్త పేరుకుపోయిందని ఫిర్యాదు అందింది.


వికారాబాద్‌ పట్టణం ఎన్నెపల్లి నుంచి ప్రతి రోజు హైదరాబాద్‌లోని విజయ డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు ల్యాబ్‌ టెస్టింగ్‌ వెళ్లాల్సి వస్తుందని, పోలీసులు కట్టడి చేయడం ఇబ్బందులు ఎదురవున్నాయని తెలుపగా, సంబంధిత డయాగ్నస్టిక్‌ సెంటర్‌ నుంచి లేఖ తీసుకొచ్చి ఏఎస్పీ వద్ద పాస్‌ తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్యలు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T09:42:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising