ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోర్‌వెల్‌ లారీ బోల్తా.. ఒకరు మృతి.. ఏడుగురికి గాయాలు

ABN, First Publish Date - 2020-12-10T05:36:06+05:30

బోర్‌వెల్‌ లారీ బోల్తా.. ఒకరు మృతి.. ఏడుగురికి గాయాలు

మృతిచెందిన లలిత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  • బాధితులంతా చత్తీస్‌ఘడ్‌వాసులు

ధారూరు: బోర్‌వెల్‌ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందగా, లారీ కింద ఇరుక్కుపోయి ఏడుగురు గాయపడ్డారు. వారిని ఎక్స్‌కవేటర్‌తో బయటకు తీసి ఆసు పత్రికి తరలించారు. ఈ సంఘటన రాంపూర్‌ గేట్‌ సమీపంలో బుధవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూర్‌కు చెందిన బోర్‌వెల్‌ లారీ(టీఎస్‌04 ఇఏ3789) ఎబ్బనూర్‌లో తాగునీటి బోర్లు వేసిన అనంతరం తిరిగి తాండూరుకు బయలుదేరింది. రాంపూర్‌గేట్‌ సమీపంలోకి రాగానే లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలోకి బోల్తాపడింది. లారీలో చత్తీ్‌సఘడ్‌ రాష్ట్రానికి చెందిన లలిత్‌(20) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ కింద ఇరక్కుపోయిన తులారాం, పూరన్‌, గంగురాం, మాంకు, చంద్రానాథ్‌, హుస్సేన్‌, మనోజ్‌లను జేసీబీతో లారీ లేపి బయటకు లాగారు. తీవ్రంగా గాయపడ్డ వీరందరినీ తాండూర్‌ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. రిగ్గు మీద పనిచేస్తున్న వీరంతా చత్తీ స్‌ఘడ్‌ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. లలిత్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్‌ ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై మురళి తెలిపారు.  


మృతదేహాన్ని మోసుకొచ్చిన సర్పంచ్‌

ప్రమాదంలో మృతిచెందిన యువకుడిని రాంపూర్‌ తండా స ర్పంచ్‌ పాండునాయక్‌ తండా వారి సహాయంతో బయటకు తీ శారు. లలిత్‌ మృతదేహాన్ని మోసుకువచ్చి ఆటోలో వేశారు.

Updated Date - 2020-12-10T05:36:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising