ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుక్కుగూడ వాసులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

ABN, First Publish Date - 2020-12-30T04:02:25+05:30

తుక్కుగూడ వాసులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

పదో వార్డులో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి సబితారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

మహేశ్వరం: నూతనంగా ఏర్పాటైన తుక్కుగూడ మున్సిపాల్టీ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పట్టణీకరణ, అభివృద్ధి కోసం కృషిచేస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్‌ పదో వార్డులో సీసీ రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, నీటి పైప్‌లైన్‌ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీసూర్యగిరి ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ తుక్కుగూడ నుంచి మంఖాల్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వరకు, సర్దార్‌నగర్‌ రోడ్ల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌, రావిరాల పెద్దచెరువు సుందరీకరణ, సూరన్‌ చెరువుకట్ట వెడల్పు, శ్రీశైలం జాతీయ రహదారిపై ఓఆర్‌ఆర్‌ సమీపంలో పార్క్‌ వంటి సౌకర్యాలన్నీ కల్పిస్తామన్నారు. ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి ఆన్‌లైన్‌ క్లాసులు టీవీలో చూ స్తున్నారా? ఫోన్లో వింటున్నారా? అని విద్యార్థులను అడిగారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కాంటెకార్‌ మధుమోహన్‌, వైస్‌చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఎల్లమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ రెడ్డిగళ్ల రత్నం, కౌన్సిలర్లు సుమన్‌, రవి, నాయకులు నర్సింహారెడ్డి, అంబయ్యయాదవ్‌, సామెల్‌రాజు, యు.శ్రీను, జె.లక్ష్మయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రీకాంత్‌, ఎ.పద్మ, శ్రీలత, పి.సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T04:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising