ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూరియా కోసం బారులు

ABN, First Publish Date - 2020-08-22T10:07:39+05:30

ధారూరు పీఎసీఎస్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధారూరు/బషీరాబాద్‌ : ధారూరు పీఎసీఎస్‌ కార్యాలయం ఎదుట శుక్రవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఒక లారీలో 450 సంచుల యూరియా రాగా ఏవో జ్యోతి, పీఎసీఎస్‌ సీఈవో నర్సిములు పర్యవేక్షించారు. ఒక్కో రైతుకు ఒకటి నుంచి రెండు బస్తాలు ఇచ్చి సరిపెట్టారు. మిగిలిన రైతులకు తర్వాత ఇస్తామని చెప్పి పంపించారు. కాగా యూరియా సరఫరాపై  రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని ఏవో జ్యోతి తెలిపారు.


రైతులు ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్లే సమస్య వస్తుందని ఆమె చెప్పారు. కాగా మూడు రోజులుగా తిరుగుతున్నాం.. యూరియా ఎప్పుడు వస్తుందంటూ బషీరాబాద్‌ మండలంలోని రైతులు శుక్రవారం వ్యవసాయ కార్యాయలం వద్ద నిరసన తెలిపారు. మూడు రోజులుగా తిరుగుతున్నా ఇవ్వడం లేదని వ్యవసాయాధికారి నాగంకృష్ణపై మండిపడ్డారు. ఏవో స్పందిస్తూ స్టాక్‌ లేనందున సరఫరాలో ఆలస్యమవుతోందని, రెండు రోజుల్లో యూరియా వస్తుందని తెలిపారు. 

Updated Date - 2020-08-22T10:07:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising