ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్మోగిన అయ్యప్ప నామస్మరణ

ABN, First Publish Date - 2020-12-16T05:05:18+05:30

మార్మోగిన అయ్యప్ప నామస్మరణ

పడిపూజలో పాల్గొన్న మాలధారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని ఆదర్శనగర్‌ కాలనీలో మంగళవారం అయ్యప్ప మహాపడి పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆరెకటికె సంఘం జిల్లా నాయకుడు మల్కేడి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజలో అయ్యప్ప మాలధారులు, భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరాజ్‌ పాండే, భరత్‌ శర్మ గురుస్వాముల సమక్షంలో పూజ, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు కొనసాగాయి. భక్తుల అయ్యప్ప నామస్మరణతో కాలనీ ప్రాంతం మార్మోగింది. ఈ సందర్భంగా అయ్యప్ప గీతాలాపనలు, భజనలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో గురుస్వాములు మల్కేడి శ్రీను, చుక్క నిరంజన్‌, అశోక్‌, మస్న అప్పి, వంశీ, నరేశ్‌, మహేశ్‌, భీముడు, బిక్కు, కౌసల్య, శ్రీను, కృష్ణయ్య, అంజయ్య, అల్లాజీ, ఆంజనేయస్వాములు తదితరులు పాల్గొన్నారు.

నేడు కడ్తాలలో అయ్యప్ప మహాపడి పూజ

కడ్తాల్‌ : మండల కేంద్రంలో శివాలయంలో డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌ ఆధ్వర్యంలో  బుధవారం అయ్యప్ప మహా పడిపూజ నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2020-12-16T05:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising