ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

ABN, First Publish Date - 2020-05-26T05:30:00+05:30

రాబోయే వర్షాకాలానికి ముందస్తు కార్యాచరణను పంచాయతీరాజ్‌ శాఖ సిద ్ధం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు : రాబోయే వర్షాకాలానికి ముందస్తు కార్యాచరణను పంచాయతీరాజ్‌ శాఖ సిద ్ధం చేస్తోంది. కరోనా వైర్‌సతో సతమతమవుతున్న తరుణంలో వర్షాకాలంలో పొంచి ఉన్న వ్యాధులు, ఇతర రోగాల పట్ల ముందస్తుగా పల్లెల్లో అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు మార్గదర్శకాలు, ఆదేశాలను జారీ చేశారు. గ్రామాల్లో వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్‌ గున్యా, టైఫాయిడ్‌, గ్యాస్ట్రోఎంట్రీస్‌, వైరల్‌ జ్వరాలు ప్రబలే అవకాశాలున్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ(జీవోనెం.189)ని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజనల్‌ వ్యాధులతో సమరం చేస్తూ కరోనా వైర్‌సను పల్లెల దరి చేరనివ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పల్లెల్లో ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మార్గదర్శకాలు జారీ చేశారు. ఐదు అంశాలపై గ్రామాల్లో ఫోకస్‌ చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 1186 గ్రామ పంచాయతీల్లో ఈ మార్గదర్శకాలను సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తప్పక  పాటించాలని ఆదేశించారు. శానిటేషన్‌ కమిటీలు ఈ విషయంలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising