ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య

ABN, First Publish Date - 2020-07-05T10:19:02+05:30

పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని సింగిల్‌విండో డైరెక్టర్‌ చేగూరి వెంకటేశ్‌, ఉపసర్పంచ్‌ కడారి రామకృష్ణ, బీసీ సంక్షేమం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, ప్రజాప్రతినిధులు


కడ్తాల్‌/మొయినాబాద్‌/ఇబ్రహీంపట్నం: పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని సింగిల్‌విండో డైరెక్టర్‌ చేగూరి వెంకటేశ్‌, ఉపసర్పంచ్‌ కడారి రామకృష్ణ, బీసీ సంక్షేమం సంఘం మండలాధ్యక్షుడు వెంకటేశ్‌ అన్నారు. మండల కేంద్రంలోని బస్టాండ్‌ కూడలిలో శనివారం దొడ్డి కొమురయ్య 74వ వర్థంతిని చండీశ్వర యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిప్పళ్ల రాజు, క్యామ రాజేశ్‌, సి.వెంకటేశ్‌, రమేశ్‌ పాల్గొన్నారు. మొయినాబాద్‌ మండల కేంద్రంలో నాయకులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి రాజు, జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌, యువజన సంఘం అధ్యక్షుడు నరేందర్‌, తదతరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువు కట్టపై ఉన్న అమర వీరుల స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-05T10:19:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising