ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రి 9.30గంటలు.. కారులో యువతితో ఓ వ్యక్తి.. చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2020-07-13T14:51:47+05:30

సినీఫక్కీలో కొందరు మూకుమ్మడిగా దాడిచేసి ఓ యువకుడిని తీవ్రంగా గాయపర్చడంతో పాటు కారు, బైక్‌లను ధ్వంసం చేసిన సంఘటన మంచాల మండలం లింగంపల్లి శివారులో జరిగింది. ఎస్సై ప్రభాకర్‌ తెలిపిన వివరాల మేరకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ ఫక్కీలో దాడి.. విధ్వంసం


మంచాల (రంగారెడ్డి): సినీఫక్కీలో కొందరు మూకుమ్మడిగా దాడిచేసి ఓ యువకుడిని తీవ్రంగా గాయపర్చడంతో పాటు కారు, బైక్‌లను ధ్వంసం చేసిన సంఘటన మంచాల మండలం లింగంపల్లి శివారులో జరిగింది. ఎస్సై ప్రభాకర్‌ తెలిపిన వివరాల మేరకు.. ఇబ్రహీంపట్నం సూపర్‌మార్కెట్‌కు చెందిన నర్సింగ్‌ సిబ్బందిని ఇళ్లకు చేరవేసే క్రమంలో రాయపోల్‌ సమీపంలోని జనహర్ష డ్రీంసిటీ వద్ద శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో కారులో యువతితో ఒంటరిగా ఉండడాన్ని సెక్యూరిటీ గార్డు పాపయ్య గమనించాడు. ఈ సమయంలో ఇక్కడ ఏంచేస్తున్నారంటూ ప్రశ్నించాడు. ఈ క్రమంలో నర్సింగ్‌కు జనహర్ష సెక్యూరిటీ సిబ్బం దికి వాగ్వాదం జరుగుతుండగా కారులో ఉన్న యువతి సీతారాంపేటకు చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తికి ఫోన్‌ చేసింది. దీంతో మల్లారెడ్డి లింగంపల్లికి చెందిన అనిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డిని వెంట తీసుకొని జనహర్షకు వెళ్లాడు. 


అక్కడ జనహర్ష సిబ్బందికి వీరికి మధ్య కొద్దిసేపు బాహాబాహీ జరిగిన తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. శ్రీకాంత్‌రెడ్డి తన స్నేహితులతో కలిసి లింగంపల్లి సమీపంలోని డైరీఫాంకు చేరుకున్నాడు. ఈ గలాటాలో శ్రీకాంత్‌రెడ్డిని గుర్తించిన పాపయ్య జరిగిందంతా తోటి సిబ్బంది ధన్‌రాజ్‌, ఇతరులకు చెప్పాడు. కొద్దిసేపటికే ధనరాజ్‌ 10 మంది అనుచరులను వెంట బెట్టుకుని శ్రీకాంత్‌రెడ్డి ఉన్న డైరీఫాం వద్దకు చేరుకుని సినీ ఫక్కీలో కర్రలు, రాళ్లతో మూకుమ్మడి దాడిచేసి చాలాసేపు విధ్వంసం సృష్టించారు. ఈ దాడిలో స్నేహితులు పారిపోగా శ్రీకాంత్‌రెడ్డిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చడంతో స్పృహ తప్పిపడిపోయాడు.  అతడి కుటుంబానికి చెందిన కారు, బుల్లెట్‌తో పాటు మరో రెండు బైక్‌లను బండరాళ్లతో ధ్వంసం చేసి పరారయ్యారు. కుటుంబసభ్యులు వచ్చి శ్రీకాంత్‌రెడ్డిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో పాపయ్య, ధన్‌రాజ్‌ మరికొందరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2020-07-13T14:51:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising