ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతకు బంగారు భవిష్యత్తు

ABN, First Publish Date - 2020-08-08T05:38:03+05:30

స్థానిక యువతకే అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని టీఆర్‌ఎస్‌వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీఆర్‌ఎస్‌వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌ పటేల్‌


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌)

స్థానిక యువతకే అత్యధిక ఉద్యోగావకాశాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని టీఆర్‌ఎస్‌వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌ పటేల్‌ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానిక యువతకే అత్యధిక ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపారు. టీఎస్‌ ఐపాస్‌ విధానంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కొత్తగా ఏర్పాటైన 12 వేల పరిశ్రమల్లో సుమారు రెండు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారని తెలిపారు. సమావేశంలో చిగుళ్లపల్లి రమేష్‌కుమార్‌, పార్టీపట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి,  ముత్యంరెడ్డి, ముత్తహార్‌ షరీఫ్‌, అనంతరెడ్డి, విజయకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T05:38:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising