రూ.7లక్షలు దొంగిలిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గాచిక్కిన దొంగ
ABN, First Publish Date - 2020-12-30T20:09:59+05:30
సిరిసిల్ల పద్మానగర్‌లో దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు.
రాజన్నా సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పద్మానగర్‌లో దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఇంటిపక్క నివసించే వ్యక్తే దొంగతనానికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో దాచిన రూ. 7లక్షల నగదును తస్కరించాడు. అదే సమయంలో ఇంటికొచ్చిన కుటుంబసభ్యులు అతనిని పట్టుకున్నారు. వారితోపాటు స్థానికులు దొంగను చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
Updated Date - 2020-12-30T20:09:59+05:30 IST