ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండ్లు, కూరగాయల ఎగుమతులకు రైల్వే వ్యాగన్లు

ABN, First Publish Date - 2020-04-12T09:03:17+05:30

పండ్లు, కూరగాయలు, ఇతర పంట ఉత్పత్తులను పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు రైల్వే పార్శిల్‌ వ్యాగన్లను ఉపయోగించుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి అభిలక్ష్‌ లిక్కి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సరఫరాదారు బాధ్యతే: అభిలక్ష్‌ లిక్కి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): పండ్లు, కూరగాయలు, ఇతర పంట ఉత్పత్తులను పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు రైల్వే పార్శిల్‌ వ్యాగన్లను ఉపయోగించుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి అభిలక్ష్‌ లిక్కి కోరారు. నిల్వచేయటానికి వీలులేని ఉత్పత్తులను రైల్వే ద్వారా రాష్ట్రాలకు రవాణా చేయటానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకున్నట్లు తెలిపారు. రైల్వే బోర్డు ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ శైలేంద్రశర్మ, అన్ని రాష్ట్రాల వ్యవసాయ కార్యదర్శులు, మిషన్‌ డైరెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తెలంగాణలో ఉత్పత్తి చేసే బత్తాయి, మామిడి, కూరగాయలు, పూల రవాణాపైనా వీసీలో చర్చించారు. ఒక సరఫరాదారు కనీసం 23 టన్నుల రవాణా పార్శిల్‌ వ్యాగన్‌ను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. లోడింగ్‌, అన్‌లోడింగ్‌ బాధ్యతలు సరఫరాదారులే చూసుకోవాలని సూచించారు.

Updated Date - 2020-04-12T09:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising