ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు రఘునందన్‌రావు ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-10-07T22:29:13+05:30

కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌, కేంద్రమంత్రికి అమిత్‌ షాకు దుబ్బాక దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు. త‌న సిబ్బంది ఫోన్‌కాల్స్‌ని ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌, కేంద్రమంత్రికి అమిత్‌ షాకు దుబ్బాక దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు. త‌న సిబ్బంది ఫోన్‌కాల్స్‌ని ప్రభుత్వం ట్యాపింగ్‌ చేస్తోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ల ట్యాపింగ్‌పై విచారణ జరపాలని కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్‌ విభాగం పనిచేస్తోందని రఘునందన్‌రావు ఆరోపించారు. అక్టోబ‌ర్ 5న జరిగిన సంఘటన ద్వారా ఇది రుజువైందని రఘునందన్‌రావు తెలిపారు. 


దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావునే ఆ పార్టీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌.. దుబ్బాకకు రఘునందన్‌ పేరునూ ప్రకటించారు. ఇంతకుముందే రఘునందన్‌ అభ్యర్థిత్వంపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర పార్టీ నాయకత్వం.. అధిష్ఠానానికి ఆయన ఒక్కడి పేరును మాత్రమే సిఫారసు చేసింది. 

Updated Date - 2020-10-07T22:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising