సన్నాలకు మద్దతు ధర రూ.3,600 చెల్లించాలి: రఘునందన్
ABN, First Publish Date - 2020-11-13T21:26:48+05:30
సన్నరకం ధాన్యానికి కనీస మద్దతు ధర రూ. 3,600 చెల్లించి రైతులను ఆదుకోవాలని..
హైదరాబాద్: సన్నరకం ధాన్యానికి కనీస మద్దతు ధర రూ. 3,600 చెల్లించి రైతులను ఆదుకోవాలని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. దుబ్బాక వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యాన్ని పరిశీలించిన ఆయన రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. 15 రోజులుగా మార్కెట్ యాడ్‌లో పంటను ఆరబెట్టి తిండి తిప్పలు లేకుండా రైతులు పడుతున్న బాధలను చూసిన రఘునందన్ రావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ మాట విని సన్నరకం ధాన్యం పండించిన రైతులకు క్వింటాళ్లకు రూ. 3,600 చెల్లించాల్పిందేనని రఘునందన్ డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Updated Date - 2020-11-13T21:26:48+05:30 IST