ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉపాధి’తో ఆర్‌అండ్‌బీ పనులు: వేముల

ABN, First Publish Date - 2020-06-18T09:52:43+05:30

రహదారి భద్రతకు దోహదపడే విధంగా రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ దగ్గర జంక్షన్‌లలో నాలుగు వైపులా ఎప్పటికప్పుడు పొదలను శుభ్రం చేయడం,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రహదారి భద్రతకు దోహదపడే విధంగా రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ దగ్గర జంక్షన్‌లలో నాలుగు వైపులా ఎప్పటికప్పుడు పొదలను శుభ్రం చేయడం, రంగులు వేయడం వంటి పనులను జాతీయ ఉపాధి హమీ పథకానికి (నరేగా) అనుసంధానించేలా ప్రణాళికలను రూపొందించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్‌ అండ్‌ బీ శాఖలో మనుషులతో చేసే పనులను నరేగా పథకానికి అనుసంధానించే అంశంపై ఎర్రమంజిల్‌లోని ఆ శాఖ కేంద్ర కార్యాలయంలో వేముల ప్రశాంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆర్‌ అండ్‌ బీ శాఖలో ఏడాదికి దాదాపు రూ.200 కోట్ల రూపాయల విలువ చేసే పనులను నరేగాకి అనుసంధానం చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. జాతీయ రహదారులకు ఇరు వైపులా ఉండే  మట్టి దిబ్బలను యంత్రాలతో కాకుండా మనుషులతో చదును చేసే విధంగా ప్రతిపాదించాలని  సూచించారు.  

Updated Date - 2020-06-18T09:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising