ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్‌ బయో మెడికల్‌ వ్యర్థాలు భస్మీకరణ

ABN, First Publish Date - 2020-03-29T11:10:25+05:30

కరోనా వైరస్‌ నేపథ్యంలో వ్యర్థాల నిర్వహణలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వారంటైన్‌లో ఉన్న వారి ఇళ్లలోని వ్యర్థాల సేకరణ, రవాణా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నేపథ్యంలో వ్యర్థాల నిర్వహణలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్వారంటైన్‌లో ఉన్న వారి ఇళ్లలోని వ్యర్థాల సేకరణ, రవాణా, నిర్వహణకు పలు ఆదేశాలు జారీ చేశారు. పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నిబంధనలను పాటించాలని కమిషనర్‌లను మునిసిపల్‌ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. క్వారంటైన్‌లో ఉన్న వారి ఇళ్లలోని వ్యర్థాలను ప్రత్యేకంగా ఎల్లో బ్యాగుల ద్వారా సేకరించాలని, ప్రత్యేకంగా రవాణా చేయాలని ఆదేశించారు. వీరి ఇళ్ల నుంచి బయో మెడికల్‌ వ్యర్థాలను కూడా ప్రత్యేకంగా సేకరించి భస్మం చేయాలని ఆదేశించారు.


క్వారంటైన్‌ లేని గృహాల నుంచి సేకరించే వ్యర్థాలలోని మాస్క్‌లు, గ్లౌజ్‌లు కూడా ప్రత్యేకంగా సేకరించి రవాణా చేసి, వాటిని భస్మం చేయాలని ఆదేశించారు. ఇక, బహిరంగ స్థలాలు, వాణిజ్య ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు, ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు, పార్కులు, గార్డెన్‌ల వద్ద పూర్తిగా శుభ్రం చేయాలని, బ్లీచింగ్‌ చల్లాలని, క్రిమిసంహారం జరిగేలా శుభ్రపర్చాలని సూచించారు. పారిశుధ్య కార్మికులకు అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలని, వారు నిర్వహించే విధుల కోసం మాస్కులు, గ్లౌజ్‌ల వంటివి అందించాలన్నారు. పారిశుధ్య విధుల్లో పాల్గొంటున్న కార్మికులకు ప్రతి రోజు కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని, అవసరమైన చికిత్సలు అందించాలని ఆదేశించారు. మహిళా స్వయంసహాయక సంఘాలచే మాస్కులు, శానిటైజర్‌ల తయారీని ప్రోత్సహించాలని కమిషనర్‌లకు సూచించారు. 

Updated Date - 2020-03-29T11:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising