ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడ్చల్‌ జిల్లాలో ముమ్మరంగా పబ్లిక్‌ టాయిలెట్‌ల నిర్మాణాలు

ABN, First Publish Date - 2020-08-13T23:59:03+05:30

పట్టణాలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణాలుగా రూపొందించేందుకు జిల్లాలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌ మల్కాజిగిరి: పట్టణాలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణాలుగా రూపొందించేందుకు జిల్లాలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 నాటికి అన్నికార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలలలో ప్రతి వెయ్యి మందికి కనీసం ఒక టాయిలెట్‌ చొప్పున నిర్మించాలని రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టమైన ఆదేశాలుజారీ చేయడంతో జిల్లాలో పబ్లిక్‌టాయిలెట్స్‌ నిర్మాణం ముమ్మరంగా చేపట్టారు. జిల్లాలో 4 కార్పొరేషన్‌లు, 9 మున్సిపాలిటీలు ఉండగా జనాభా ప్రాతిపదికన ప్రతి వెయ్యి మందికి ఒక టాయిలెట్‌ చొప్పున పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించేందుకు జిల్లా కలెక్టర్‌ పరిపాలన అనుమతులు జారీ చేశారు.


నూతనంగా 310 మరుగుదొడ్లు నిర్మించేందుకు అందులో 96 షీ టాయిలెట్స్‌ నిర్మించేందుకు అనుమతించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటినీ పరిశుభ్ర నగరాలుగా , బహిరంగ మల మూత్ర రహిత నగరాలుగా (ఓడీఎఫ్‌) చేసేందుకు ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీంతో పాటు నగరాల్లోని ప్రజలు, వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండేందుకు పెద్దయెత్తున టాయిలెట్లను నిర్మించాలని అన్ని మున్సిపాలిటీలను ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సవ్చ్చ భారత్‌ కార్యక్రమాల్లోనూ స్వచ్చ సౌశయాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లాలో 15వ తేదీ నాటికి 55 మరుగుదొడ్లు అందుబాటులోకి వస్తాయని జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. 

Updated Date - 2020-08-13T23:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising