విద్యార్థి ప్రాణం తీసిన పబ్జీ గేమ్
ABN, First Publish Date - 2020-12-11T08:37:46+05:30
పబ్జీ గేమ్.. ఓ విద్యార్థి మరణానికి కారణమైంది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన
కులకచర్ల, డిసెంబరు 10: పబ్జీ గేమ్.. ఓ విద్యార్థి మరణానికి కారణమైంది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన లలితమ్మ, అనంతయ్య కుమారుడు ఓంకార్(15).. అదే గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్ పాఠాలు వినేవాడు. సెల్‌ఫోన్‌లోని వీడియో గేమ్‌లకు బాగా అలవాటు పడ్డాడు.
అది గమనించిన తల్లిదండ్రులు.. చదువుపై శ్రద్ధ పెట్టాలంటూ మందలించారు. ఈ క్రమంలో.. ఓంకార్ బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొన్నాడు. సదరు విద్యార్థి పబ్జీ గేమ్ విపరీతంగా ఆడేవాడని స్థానికులు చెప్పారు.
Updated Date - 2020-12-11T08:37:46+05:30 IST