రైతులకు మద్దతుగా నేడు, రేపు నిరసనలు
ABN, First Publish Date - 2020-12-05T08:37:24+05:30
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరిని వ్యతిరేకిస్తూ శని, ఆదివారాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అఖిల
8న రహదారుల దిగ్బంధం
హైదరాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరిని వ్యతిరేకిస్తూ శని, ఆదివారాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ తెలంగాణ శాఖ ప్రతినిధులు తెలిపారు.
నగరంలోని గన్‌పార్కులో అమరవీరుల స్థూపం వద్ద శనివారం నిరసన వ్యక్తం చేయనున్నట్లు కమిటీ ప్రతినిధులు పశ్య పద్మ, వేములపల్లి వెంకట్రామయ్య తెలిపారు. ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా రహదారుల్ని దిగ్బంధం చేయాలని పిలుపునిచ్చారు.
Updated Date - 2020-12-05T08:37:24+05:30 IST