ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాచకొండ కమిషనరేట్‌పరిధిలో 24వ తేదీ వరకూ నిషేధాజ్ఞలు

ABN, First Publish Date - 2020-06-22T22:37:10+05:30

రాజకొండ పోలీస్‌కమిషనరేట్‌ పరిధిలో ఈనెల 24వ తేదీ వరకూ ఊరేగింపులు, బహిరంగ సభలను నిషేధించినట్టు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాజకొండ పోలీస్‌కమిషనరేట్‌ పరిధిలో ఈనెల 24వ తేదీ వరకూ ఊరేగింపులు, బహిరంగ సభలను నిషేధించినట్టు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేకించి కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ సభలు,  ఊరేగింపులు నిర్వహించరదని అన్నారు. తప్పని సరి పరిస్థితుల్లో వీటిని నిర్వహించాల్సి వస్తే జోనల్‌డిప్యూటీ కమిషనర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రజలు అక్రమంగా మారణాయులధాలను కలిగి ఉండడం, బహిరంగ ప్రదేశాల్లోనూ, రోడ్లపైనా ఎక్కువ మంది ఒక చోట గుమిగూడడం, ఇతరులకు ఆటంకాలు కలిగించడం వంటి చర్యలు కూడా చేయరాదన్నారు. రాళ్లను కలిగి ఉండడం, వాటిని తరలించడం, లౌడ్‌స్పీకర్స్‌, మైకులను వినియోగించడాన్ని కూడా నిషేధించినట్టు తెలలిపారు. ప్రజలు నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే వారిపై పోలీస్‌ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే కొన్నింటికి నిషేధాజ్ఞల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇందులో పోలీసు అధికారులు కూటీ, మిలిటరీ అధికారుల విధులు, హోమ్‌గార్డ్స్‌ విదులు, బొనఫైడ్‌  శవయాత్రలకు అనుమతి ఉంటుందన్నారు. నిషేధాజ్ఞలు ఈనెల 18వ తేదీ ఉఆయం 6గంటల నుంచి 24వతేదీ ఉదయం 6గంటల వరకూ కొనసాగుతాయని అన్నారు. 

Updated Date - 2020-06-22T22:37:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising