ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి

ABN, First Publish Date - 2020-10-30T11:20:27+05:30

నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో యువత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హామీలతో పబ్బం గడుపుతున్న సీఎం కేసీఆర్‌\

ఉద్యోగాల్లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత.

టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం


కేయూ క్యాంపస్‌, అక్టోబరు 29: నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో యువత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. గురువారం ఉదయం కేయూ క్యాంపస్‌లోని క్రీడా మైదానంలో వాకర్స్‌తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత నైరాశ్యంతో ఆత్మహత్యలకు పాల్పడుతోందని అవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చేందుకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని కానీ అవి ఇప్పటికీ నెరవేరలేదని ఆరోపించారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు వేచి చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసేందుకే ప్రైవేట్‌ యూనివర్సిటీలను తెచ్చారని విమర్శించారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు చిల్లా రాజేంద్రప్రసాద్‌, డాక్టర్‌ అశోక్‌రెడ్డి, టీజేఎస్‌ నాయకులు డాక్టర్‌ సంజీవ్‌, విజయ్‌కుమార్‌, దుర్గం సారయ్య, వాకర్స్‌ అసోసియేషన్‌ బాధ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T11:20:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising